Begin typing your search above and press return to search.
రకుల్ లవ్ బహిరంగం వెనుక ఉద్దేశ్యం ఇదేనట!
By: Tupaki Desk | 23 May 2022 10:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ఈమద్య కాలంలో అన్ని భాషల ఇండస్ట్రీల్లో కూడా లవ్ స్టోరీలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా లవ్ స్టోరీ లు నడుస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో కొన్ని నిజం అయ్యి ఉండవచ్చు.. కొన్ని ఫేక్ అయ్యి ఉండవచ్చు. అయినా కూడా మీడియాలో రెగ్యులర్ గా నిలుస్తూనే ఉంటారు.
చాలా మంది సెలబ్రెటీలు ప్రేమలో ఉన్నా కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. వారు పార్టీలకు పబ్ లకు వెళ్లడం.. ఫంక్షన్స్ కు వెళ్లడం వంటివి చేయడం వల్ల మీడియాలో వార్తలు వచ్చి మెల్ల మెల్లగా వారు ప్రేమలో ఉన్నట్లుగా బహిర్ఘతం అవుతుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం మీడియాలో వార్తలు రాకుండానే తమ ప్రేమ వ్యవహారంను క్లియర్ గా అందరికి తెలిసేలా చెప్పేసింది.
నిర్మాత.. నటుడు అయిన జాకీ భగ్నానీ తో రకుల్ ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. ఆ విషయం గురించి వెంటనే చెప్పడం వెనుక ఉద్దేశ్యంతో తాజాగా ఆమె వెళ్లడించింది. తాము ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా చెప్పకుంటే మీడియాలో మేము కలిసి కనిపించిన ప్రతి సారి కూడా ఏదో ఒక పుకారు పుట్టించడం.. వార్తను ఇవ్వడంకు ప్రయత్నిస్తారు.
మా వ్యక్తిగత విషయాలు వార్తల్లో నిలువకూడదు. తాము కెరీర్ పరంగా మాత్రమే మీడియాలో ఉండాలని భావించాము. అందుకే వ్యక్తిగత విషయంను చాలా తొందరగా క్లారిటీ ఇచ్చాం. మేము ఇద్దరం ఒకరికి ఒకరం క్లారిటీ ఇచ్చుకున్న వెంటనే సోషల్ మీడియా ద్వారా ప్రేమ విషయాన్ని తెలియజేసినట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక ఈ అమ్మడు సౌత్ సినిమా ల కంటే బాలీవుడ్ సినిమాలపై దృష్టి ఎక్కువ పెట్టింది. ఇటీవల వచ్చిన సినిమాల... కమిట్ అయ్యి చేస్తున్న సినిమాలు.. చర్చల దశలో సినిమాలన్నీ కలిపి ఏకంగా పది వరకు ఉన్నాయి. బాలీవుడ్ లో ఈ స్థాయిలో సినిమా ఆఫర్లు రావడంతో రకుల్ ముంబయిలోనే సెటిల్ అయ్యే ఆలోచనతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల సౌత్ నుండి ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తానంటూ క్లారిటీ ఇచ్చింది.