Begin typing your search above and press return to search.
ఆ నవ్వులో ముత్యాలే రాలునేమో...!
By: Tupaki Desk | 6 Aug 2021 12:30 PM ISTనవ్వితే ఎలాంటి వారైనా అందంగా కనిపిస్తారు. నవ్వుకు ముఖవర్ఛస్సుతో అసలు పనిలేదు. మరి నిజంగా అందమైనా అమ్మాయే నవ్వితే ఆ కవ్వింత తుళ్లింత ఇంకెంత అందంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందమైన నాయిక నవ్వితే ఆ నవ్వులో సరిగమలే వేరు. రకుల్ ప్రీత్ సింగ్ ఇదిగో ఇలా ఇంతందంగా పగలబడి నవ్వేస్తోంది. ఆ నవ్వు చూసి ముత్యాలే రాలిపోతాయేమో అంటూ బోయ్స్ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ లో మునుపెన్నడూ చూడని నవ్వులవి. అంతేనా ఆ నవ్వులో ఎంతో కవ్వింపు. ఫోజులోనూ అంతే వేడెక్కించింది. ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి మీ కడుపుకి నొప్పి పుట్టేంతగా నవ్వండని ట్యాగ్ చేసింది.
అయితే రకుల్ ఇలా పగలబడి నవ్వండి! అంటూ ఎందుకని ట్యాగ్ చేసింది అంటే.. దానికి కారణం లేకపోలేదు. రకుల్ ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగానే తనదైన శైలిలో ప్రచారం చేస్తోంది. ఇది హిందీ వెబ్ సిరీస్.. కామెడీ బేస్డ్ సిరీస్ కావడంతోనే రకుల్ ఇలా పడి పడి నవ్వుతూ...ఆడియన్స్ ని కడుపుబ్బిపోయేలా నవ్వుకునే ఛాన్సుందంటూ ప్రమోషన్ చేసింది.
రకుల్ ధరించిన డ్రెస్ విషయానికి వస్తే పూల ప్రింట్ క్రాప్ టాప్ తో ధరించింది... బెల్ స్లీవ్ లతో పాటు ముందు భాగంలో అలా ఫ్రాక్ ని ముడి వేసింది. అలాగే బాటమ్ లో లేత గోధుమరంగు ప్యాంటును రకుల్ ధరించింది. మేకప్ అతి తక్కువగా వేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. ఇక వెబ్ సిరీస్ మ్యాటర్ కి గురించి రకుల్ చాలా పాజిటివ్ గా ఉంది. భవిష్యత్ అంతా వెబ్ సిరీస్ లదే అని అభిప్రాయపడింది. నవతరం నటులకు మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు. అలాగే యూత్ తో ఇప్పుడు తాము సైతం పోటీ పడాల్సి వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తోంది. వచ్చే రెండేళ్లు కూడా అక్కడ సినిమాలతోనే బిజీగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కొండపొలం రిలీజ్ కి రావాల్సి ఉంది. అడవి నేపథ్యం.. విజువల్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమా ఇది. `31 లేడీస్ నైట్` అనే మరో చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది. అటు కొన్ని తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో `మేడే`లో నటిస్తోంది. ఈ థ్రిల్లర్ డ్రామాలో పైలట్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డాక్టర్ జి అనే చిత్రంలో కూడా రకుల్ నటిస్తుంది. ఇంకా పలు హిందీ సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.
దేనికైనా టైమ్ కలిసి రావాలి..!
రకుల్ కెరీర్ కొంత కాలంగా ఒడిదుడుకుల్లోనే ఉంది. ఇటీవల టాలీవుడ్ లో విజయం దోబూచులాడుతోంది. ధృవ తర్వాత సరైన హిట్ సినిమా లేదు. ఇంతకుముందు నాగార్జున సరసన నటించిన మన్మథుడు 2 పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా తనను వరుస అవకాశాలు వరించాయి. సెట్స్ పై ఉన్న అరడజను సినిమాల్లో కనీసం రెండు హిట్లు పడినా కెరీర్ ని చాలా కాలం డ్రైవ్ చేయగలదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయుడు 2 వివాదాల వల్ల ఆగిపోకపోతే తనకు ఎంతో మేలు జరిగేదని కూడా విశ్లేషిస్తున్నారు. దేనికైనా టైమ్ కలిసి రావాలి మరి.