Begin typing your search above and press return to search.

తమిళంలో బిజీ కాబోతున్న ప్లాప్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   4 Jun 2020 6:50 AM GMT
తమిళంలో బిజీ కాబోతున్న ప్లాప్ హీరోయిన్!
X
టాలీవుడ్ లో చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కుర్ర హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. తెలుగులోని యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరితో నటించింది. ఇటీవలే కింగ్ నాగార్జున సరసన కూడా నటించి ప్లాప్ అందుకున్న తర్వాత ఈ భామ బాగా స్లో అయ్యింది. ఇక లాభం లేదని అటు బాలీవుడ్ మీద ఆశలతో అటువైపు దృష్టి పెట్టిన అమ్మడికి సౌత్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో అయితే ఎవరు కూడా రకుల్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇక బాలీవుడ్ లో ఆఫర్లు ఉన్నా కూడా అవి ఇంకా కన్ఫర్మ్ కాలేదట. ఈ భామ ప్రస్తుతం అయితే కేవలం తమిళ ఇండస్ట్రీ పైనే ఆశలు పెట్టుకుంది. మొన్నామధ్య హీరో సూర్యతో కలిసి 'ఎన్ జి కె' సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టింది. ఇక లాభం లేదని తమ్ముడు కార్తీతో కలిసి దేవ్ అనే సినిమా చేసింది.

కానీ ఆ సినిమా కూడా బోల్తా కొట్టడంతో కెరీర్ పరంగా సందిగ్ధంలో పడింది. ఇక ఎట్టకేలకు స్టార్ డైరెక్టర్ శంకర్ తన 'భారతీయుడు-2' సినిమాలో అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేగాక అమ్మడికి తాజాగా హీరో శివ కార్తికేయన్ సినిమా 'అయలన్'లో అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నా కూడా రకుల్ కి అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. కానీ అవి తెలుగు సినిమాలు మాత్రం కాదు. తమిళ ఇండస్ట్రీ నుండి ప్రస్తుతం అమ్మడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయట. ఇప్పుడైతే ఈ రెండు సినిమాల పై ఆశలు పెట్టుకుంది రకుల్. ఇక ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సినిమాలన్నీ షూటింగులకు సిద్ధం అవుతున్నాయట. ఇక షూటింగ్ షెడ్యూల్ వస్తే త్వరలోనే భారతీయుడు-2, శివ కార్తికేయన్ 'అయలన్' సినిమాల చిత్రీకరణలో పాల్గొంటానంటుంది రకుల్. చూడాలి మరి తమిళ ఇండస్ట్రీలో అయినా ఈ భామ నిలదొక్కుకుంటుందేమో!