Begin typing your search above and press return to search.

ఇంత‌గా ఆర‌బోస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరేమి?

By:  Tupaki Desk   |   11 July 2021 5:55 AM GMT
ఇంత‌గా ఆర‌బోస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరేమి?
X
సోష‌ల్ మీడియాల్లో శ‌ర్మాగాళ్స్ నేహాశ‌ర్మ‌- ఐషా శ‌ర్మ దుమారం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్లు వీడియో షూట్ల‌ను రిలీజ్ చేస్తూ సిస్ట‌ర్స్ అభిమానుల‌ను టెంప్ట్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటున్నారు.

ఇటీవ‌ల నేహా శ‌ర్మ త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌ను హీరోయిన్ గా తీర్చిదిద్దేందుకు చాలానే గైడ్ చేస్తోంది. ఇక ఫోటోషూట్ల‌తో అభిమానుల్లోకి దూసుక‌ళ్ల‌డ‌మెలానో టెక్నిక్స్ నేర్పిస్తోంది. బిహార్ కి చెందిన జాతీయ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలుగా పార్టీ క్యాడ‌ర్ లో ఆ ఇద్ద‌రికీ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. బాలీవుడ్ లో ఈ యంగ్ బ్యూటీస్ రాణించేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

ఎక్స్ పోజింగులో శ‌ర్మా గాళ్ దుమ్ము దుమారం గురించి నిరంత‌రం యూత్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్నా ఎందుక‌నో అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్ర‌మే. ఎంత‌గా చెల‌రేగుతున్నా ఆఫ‌ర్లు అయితే రాలేదు. ముఖ్యంగా మ‌హ‌మ్మారీ ప్ర‌భావం ఐషా శ‌ర్మ కెరీర్ పై తీవ్రంగానే ఉంది. ఎంత‌గా ట్రై చేస్తున్నా జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్త‌య్యే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి తాను న‌టించేందుకు సంత‌కాలు చేసినవి కూడా సెట్స్ కి వెళ్ల‌లేదు.

29ఏళ్ల ఐషా శ‌ర్మ జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి ఆఫ‌ర్ల కోసం వెయిటింగ్. మ‌రోవైపు నేహాశ‌ర్మ హేరాఫేరీ 3 చిత్రంలో న‌టిస్తోంది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఇంత‌కుముందు తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లోనూ చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. జోగిరా సారా రారా అనే చిత్రంలో న‌వాజుద్దీన్ స‌ర‌స‌న నేహా న‌టిస్తోంది. అలాగే త‌దుప‌రి ప‌లు వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించ‌నుంది. శ‌ర్మ సిస్ట‌ర్స్ సౌత్ కెరీర్ పైనా దృష్టి సారించినా ఎందుక‌నో స‌రైన ఆఫ‌ర్లు అయితే లేవ్.