Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : రత్తాలు ఈజ్‌ బ్యాక్‌

By:  Tupaki Desk   |   5 April 2019 12:07 PM IST
పిక్‌ టాక్‌ : రత్తాలు ఈజ్‌ బ్యాక్‌
X
రాయ్‌ లక్ష్మి టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమల్లో కూడా తన లక్‌ ను పరీక్షించుకుంటుంది. ఇటీవలే ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సినిమా చేసింది. కాని ఆ సినిమా కూడా ఆమెకు నిరాశ మిగిల్చింది. సినిమాలు నిరాశ పర్చినా కూడా ఆమె మాత్రం హాట్‌ ఫొటో షూట్‌ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. ఇటీవలే వేరీజ్‌ వెంకట లక్ష్మి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయ్‌ లక్ష్మి ఆ చిత్రంలో కాస్త లావుగా ఉన్నట్లుగా విమర్శలు ఎదుర్కొంది. దాంతో పాటు ఈమె కడుపు పెద్దగా ఉంది, గర్బవతి అనే పుకార్లు కూడా పుట్టుకు వచ్చాయి.

తన బాడీపై వివిద రకాల కామెంట్స్‌ వచ్చిన నేపథ్యంలో రెండు నెలలు కఠినంగా వర్కౌట్స్‌ చేసి ఈ అమ్మడు మళ్లీ మునుపటి నాజూకు బాడీని దక్కించుకుంది. తాజాగా ఈమె బికినీతో ఫొటో షూట్‌ ఇచ్చి రచ్చ చేసింది. ఖైదీ నెం.150 చిత్రంలో రత్తాలుగా ఐటెం సాంగ్‌ తో అదరగొట్టిన ఈ అమ్మడు మరిన్ని ఐటెం సాంగ్స్‌ ను చేసేందుకు ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఈమె తెలుగులో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దం అవుతోంది.