Begin typing your search above and press return to search.

శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం ఏమైనా నా తప్పా!

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:00 PM GMT
శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం ఏమైనా నా తప్పా!
X
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితంపై ‘800’ పేరిట తమిళంలో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముత్తయ్య మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నారు.

అయితే ముత్తయ్య పాత్రను తమిళ హీరో విజయ్ సేతుపతి పోషించడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దర్శకుడు భారతీ రాజా కూడా వారితో గళం కలిపాడు. ముత్తయ్య శ్రీలంక ప్రభుత్వ మతవాదానికి మద్దతుదారు అని.. అతడు ఒక భారత ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ముత్తయ్య బయోపిక్ లో నటించి తమిళుల సెంటిమెంట్లను గాయపరచవద్దని విజయ్ కు డిమాండ్ చేశారు.

అయితే ముత్తయ్య ఈ వివాదంపై స్పందించాడు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశాడు. ‘శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం ఏమైనా నా తప్పా.. ఒకవేళ భారత్ లో పుట్టి ఉంటే టీమిండియాలో ఆడేవాడిని.. నేను తమిళులకు వ్యతిరేకం అంటూ వివాదం రేకెత్తించారు. రాజకీయ రంగు పులిమారు. శ్రీలంకలో తమిళుల నరమేధానికి నేను మద్దతు పలికానని ఆరోపించారు. శ్రీలంక వాసులను, తమిళులను తాను పల్లెత్తు మాట అనలేదు. తమిళులకు తాను ఎంతో మద్దతు ఇచ్చాను. శ్రీలంకలో తమిళులకు సేవా చేశాను. నాపై ఆరోపణలు చేయవద్దు’ అని ముత్తయ్య మురళీ ధరన్ ఈ వివాదంపై ఒక లేఖను విడుదల చేశాడు.

అయితే విజయ్ పై ఆరోపణలను నటి రాధిక ఖండించారు. విజయ్ కు మద్దతు పలికారు. తమిళ వ్యక్తికి చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు మత్తయ్య కోచ్ గా ఉండటాన్ని ఎందుకు తప్పు పట్టడం లేదని విమర్శలు చేసే వారిని ప్రశ్నించారు.