Begin typing your search above and press return to search.

మళ్లీ ఫామ్‌ లోకి రాశి.. న్యూ లుక్‌ తో రచ్చ

By:  Tupaki Desk   |   24 Jun 2020 9:00 AM IST
మళ్లీ ఫామ్‌ లోకి రాశి.. న్యూ లుక్‌ తో రచ్చ
X
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన సీనియర్‌ హీరోయిన్‌ రాశి మళ్లీ ఫామ్‌ లోకి వచ్చింది. కొన్ని నెలల క్రితం రాశి చాలా లావుగా ఈమె సినిమాల్లో నటించగలదా అన్నట్లుగా కనిపించింది. గత కొన్ని నెలలుగా షూటింగ్‌ లేక పోవడంతో రాశి తన లుక్‌ మొత్తం మార్చేసుకుంది. చాలా బరువు తగ్గి స్లిమ్‌ అయ్యింది. స్లిమ్‌ అయిన రాశి ఒక సినిమా షూటింగ్‌ లో పాల్గొంది. నిన్నటి నుండి ఆ షూటింగ్‌ లో పాల్గొన్నట్లుగా రాశి తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పేర్కొంది.

షూటింగ్‌ సెట్స్‌ లో సందడి వైరస్‌ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని రాశి తన వీడియోలో షేర్‌ చేసింది. వీడియోలో రాశి లుక్‌ కు అంతా అవాక్కవుతున్నారు. హీరోయిన్‌ గా రాశి ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉందని.. నాలుగు పదుల వయసులో కూడా రాశి అందం పరంగా ఏమాత్రం తగ్గలేదు అదే క్యూట్‌ నెస్‌ తో రాశి ఆకట్టుకుంటుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

రాశి న్యూ లుక్‌ తో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. నెట్టింట ఆమె కొత్త ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం రాశి ఒక సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తుంది. అందుకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నాయి. ముందు ముందు రాశి పవర్‌ ఫుల్‌ పాత్రలతో బిజీ బిజీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇదే ఫిజిక్‌ ను మెయింటెన్‌ చేస్తే రాశి మరో పదేళ్ల పాటు చేతినిండా ఆఫర్లతో వరుసగా చిత్రాలు చేయవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాశి కొత్త లుక్‌ రచ్చగా ఉందనే టాక్‌ దక్కించుకుంది.