Begin typing your search above and press return to search.
ఆ హీరోతో నటించాలని ఉంది: ప్రియమణి
By: Tupaki Desk | 10 May 2023 11:30 AM ISTప్రియమణి స్టార్ హీరోయిన్ గా రాణించి, ప్రస్తుతం కథ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. ఆమె తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపాడారు. తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రాణించారు. అయితే, ఓ హీరోతో నటించాలనే ఆమె కోరిక మాత్రం తీరలేదట. ఇటీవల ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. తనకు మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఉందని ఆమె చెప్పడం విశేషం.
ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం కస్టడీ. ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు. ఆమె ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించడం విశేషం. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కస్టడీ లాంటి సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు లో చాలా టాలెంట్ ఉందన్నారు. ఆయన మూవీ టేకింగ్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ ప్రతి సన్నివేశాన్ని చాలా ఓపికగా వివరిస్తారన్నారు. ఇక హీరో నాగ చైతన్య గురించి మాట్లాడుతూ, తనకు చైతూతో సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడిందన్నారు. మొదటి సారి చైతూతో స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు అందరు స్టార్ హీరోలతో తాను నటించానని, కానీ చిరంజీవితో చేయలేదని చెప్పారు. ఆయనతో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ఇక ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు. డైరెక్టర్ తనకు కథ చెప్పినప్పుడే తన పాత్ర బాగా నచ్చిందని ఆమె చెప్పారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో చైతూ కానిస్టేబుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. థాంక్యూ డిజాస్టర్ తో వెనకపడిన చైతూకి ఈ హిట్ చాలా అవసరం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.