Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ పై సీనియర్ హీరోయిన్ అతి పెద్ద అభాండం
By: Tupaki Desk | 20 Nov 2022 9:02 PM ISTటాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ పై సీనియర్ హీరోయిన్ ప్రేమ సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా త్రివిక్రమ్ వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని.. ఆయన నాతో బలవంతంగా చిరునవ్వుతో అనే సినిమాను చేయించడం వల్లే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆఫర్లు తగ్గాయి అని ప్రేమ ఆరోపించింది.
ధర్మచక్రం సినిమా తో హీరోయిన్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రేమ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న సమయంలోనే చిరునవ్వుతో అనే సినిమాలో ప్రేమ నటించింది. ఆ సినిమాలో మొదట ప్రేమ నటించేందుకు నిరాకరించిందట. కానీ ఆ సినిమాకు రచయిత అయిన త్రివిక్రమ్ పాత్ర ను హైలెట్ చేసి చెప్పడం వల్ల చేసినట్లుగా పేర్కొంది.
హీరోయిన్ గా చిరునవ్వుతో సినిమాలో తనను నటింపజేస్తున్నట్లుగా చెప్పి చివరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. అది కాకుండా ఒక పెద్దగా ప్రాముఖ్యత లేని నెగటివ్ పాత్రలో నటింపజేశాడు అంటూ ప్రేమ ఆరోపించింది. త్రివిక్రమ్ తనకు చెప్పింది ఒకటి.. సినిమాలో నా పాత్రను చూపించింది ఒకటి అంటూ ప్రేమ ఆరోపించింది.
హీరో వేణు పాత్రకు మరదలి పాత్రను ప్రేమ తో చేయించారు. సినిమాలో ప్రేమ పాత్ర ప్రేమించి లేచి పోయి.. ఆ వ్యక్తి మోసం చేయడం తో తిరిగి వస్తుంది. కథ లో కీలకమే అయినా కూడా ఏమాత్రం ఆమె కు ప్రాముఖ్యత లేదు అనేది అప్పట్లో ప్రచారం జరిగింది.
తాజాగా ప్రేమ ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో మాట్లాడుతూ.. చిరునవ్వుతో సినిమా చేయడం వల్లే తన కెరీర్ నాశనం అయ్యింది. త్రివిక్రమ్ ఆ సమయంలో నన్ను మోసం చేశాడు. ఆయన చాలా నమ్మకంతో చెప్పడం వల్ల చిరునవ్వుతో సినిమాను చేశాను. కానీ ఆ సినిమా చేసిన తర్వాత నాకు అన్నీ కూడా అలాంటి పాత్రలే వచ్చాయి.
ఆ సమయంలో చిరునవ్వుతో సినిమాలో ఆ పాత్ర చేయకుంటే కచ్చితంగా మరి కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా కంటిన్యూ అయ్యేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమ మీడియాలో అటెన్షన్ కోసం త్రివిక్రమ్ పేరు వాడుకుంటుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఆ విషయమై స్పందించలేదు.