Begin typing your search above and press return to search.

సెట్ లో ఉన్న ఓ న‌టుడు డ్ర‌గ్స్ ఎలా పీల్చాలో నేర్పించాడ‌ట‌!

By:  Tupaki Desk   |   4 March 2021 10:47 AM GMT
సెట్ లో ఉన్న ఓ న‌టుడు డ్ర‌గ్స్ ఎలా పీల్చాలో నేర్పించాడ‌ట‌!
X
అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది హీరోయిన్ పూర్ణ‌. ఈ కేర‌ళ కుట్టి తెలుగులో మంచి మంచి చిత్రాల్లో న‌టించింది. ‘అవును’ వంటి హారర్ మూవీతో తనలోని మరో యాంగిల్ చూపించిన పూర్ణ.. ఇప్పుడు విలన్ క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

యంగ్ హీరో రాజ్ తురుణ్ లేటెస్ట్ మూవీ ‘పవర్ ప్లే’. ఈ చిత్రం మార్చి 5న రిలీజ్ కాబోతోంది. థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో రాబోతున్న ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసింది పూర్ణ‌. మొద‌టి సారిగా విల‌న్ క్యారెక్ట‌ర్ ప్లే చేస్తున్న పూర్ణ‌.. ఇందులో డ్ర‌గ్స్ అడిక్ట్ అయిన వ్య‌క్తిగా క‌నిపించ‌బోతోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది యూనిట్ . ఈ సందర్భంగా మాట్లాడిన పూర్ణ‌.. ఈ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ సీక్రెట్ రివీల్ చేసింది. ఈ మూవీలో తాను డ్ర‌గ్ తీసుకునే సీన్స్ ఉన్నాయ‌ని, వాటిని చేయ‌డానికి చాలా ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చింది.

డ్ర‌గ్స్ ను ర‌క‌ర‌కాలుగా తీసుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇంజెక్ష‌న్ త‌ర‌హావి వెయిన్ కు తీసుకుంటారు. పౌడ‌ర్ త‌ర‌హావి ముక్కుతో పీలుస్తారు. ఈ సినిమాలో డ్ర‌గ్స్ పీల్చే స‌న్నివేశాలో న‌టించింద‌ట పూర్ణ‌. అయితే.. మొద‌ట్లో పౌడ‌ర్ ను స‌రిగా పీల్చ‌డం రాక‌.. నేరుగా పొడి మొత్తం ముక్కులోకి వెళ్లిపోయింద‌ట‌. ఈ క్ర‌మంలో సెట్ లో ఉన్న ఓ న‌టుడు ఎలా పీల్చాలో నేర్పించాడ‌ట‌. ఆ విధంగా ఆ సీన్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చింది.