Begin typing your search above and press return to search.

ఈసారి పూర్ణ చాలా స్పెషల్

By:  Tupaki Desk   |   10 April 2018 5:33 AM GMT
ఈసారి పూర్ణ చాలా స్పెషల్
X
దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ప్రస్తుతం అల్లరి నరేష్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వీరి కాంబినేషన్ కి మంచి సక్సెస్ రేటు ఉండడంతో ఇండస్ట్రీలో ఈమూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నందిని రావు.. చిత్రా శుక్లాలు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం ఇప్పటికే చెప్పేశారు. అయితే.. ఇప్పుడీ మూవీలో కి మరో హీరోయిన్ ఎంటర్ అయింది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీలో పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట.

గతంలో సీమటపాకాయ్.. లడ్డూబాబు.. మామ మంచు అల్లుడు కంచు వంటి చిత్రాలలో అల్లరి నరేష్ కి జోడీగా నటించింది పూర్ణ. ఇప్పుడు అల్లరి నరేష్.. సునీల్ హీరోలుగా యాక్ట్ చేస్తున్న కామెడీ మల్టీ స్టారర్ లో కీలక పాత్రను చేయబోతోంది. 'సినిమాలో ఇది చాలా కీలకమైన.. ఇంపాక్ట్ చూపే రోల్ మాదిరిగా ఉంటుంది. ఈ రోల్ పోషించే వాళ్లకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని భావించాను. గత కొన్నేళ్లుగా లీడింగ్ హీరోయిన్ గా నటిస్తున్న పూర్ణ అయితేనే కరెక్ట్ అనిపించింది. హోమ్లీ రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్ కూడా మెప్పించడం పూర్ణ ప్రతిభ కావడంతో ఆమెను తీసుకున్నాం' అని చెప్పాడు దర్శకుడు భీమినేని.

ఈ సినిమాలో పూర్ణ రోల్ ను ఓ సర్ ప్రైజ్ ప్యాకేజ్ అంటున్నాడు దర్శకుడు. గతంలో ఆమె ఎన్నడూ చేయనంత కొత్తగా ఉంటుందట. అలాగే ఈమె పాత్ర చుట్టూ సస్పెన్స్ కూడా ఉంటుందని.. దాన్ని ఇప్పుడే రివీల్ చేయబోమని ఊరిస్తున్నాడు దర్శకుడు. మరి పూర్ణ అంత ప్రత్యేకంగా ఏం చూపించబోతోందో చూడాలి.