Begin typing your search above and press return to search.

మీటూ : నాతో మగాళ్లు మాట్లాడట్లేదు

By:  Tupaki Desk   |   25 Nov 2018 11:46 AM GMT
మీటూ : నాతో మగాళ్లు మాట్లాడట్లేదు
X
మీటూ ఉద్యమం వల్ల ఆడవారి పై లైంగిక వేదింపులు తగ్గాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. మీటూ అంటూ ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు రావడం వల్ల అవతల వ్యక్తి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. పదేళ్ల క్రితం స్పందించకుండా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడితే ప్రయోజనం ఏముందని ఎక్కువ శాతం ప్రశ్నిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ పూర్ణ కూడా ఈ విషయంపైనే స్పందించింది.

లైంగిక దాడి జరిగినా, లైంగిక వేదింపులు జరిగినా వెంటనే స్పందించాలి తప్ప ఎప్పుడో జరిగితో ఇప్పుడు స్పందించడం ఏంటీ. అవకాశాలు తగ్గినాక, ఫేడ్‌ ఔట్‌ అవుతున్న సమయంలో మీటూ అంటూ వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ చేసుకోవడమే అంటూ పూర్ణ అభిప్రాయం వ్యక్తం చేసింది. మీటూకు తాను వ్యతిరేకంగా కాదంటూనే ఎప్పటి విషయాలనో ఇప్పుడు ప్రస్థావించొద్దని ఆమె చెబుతోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మీటూ ఆరోపణలు కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని పూర్ణ కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది.

మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుండి నాతో చనువుగా ఉండే మేల్‌ ఫ్రెండ్స్‌ మరియు ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న మేల్‌ టెక్నీషియన్స్‌ మరియు నటులు అంతా కూడా నాతో మాట్లాడేందుకే ఆసక్తి చూపడం లేదని పూర్ణ చెప్పుకొచ్చింది. తాను చనువు తీసుకుని మాట్లాడాలని ప్రయత్నించినా కూడా వారు మునుపటి తరహాలో ఉండేందుకు భయపడుతున్నారని పేర్కొంది. మీటూ వల్ల లాభంతో పాటు నష్టం కూడా జరుగుతుందనేది పూర్ణ అభిప్రాయం. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ మయాళ ముద్దుగుమ్మ తాజాగా అదుగో లో ప్రత్యేక పాటతో వచ్చి, మెప్పించలేక పోయింది.