Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మ ఏంటీ డబుల్ స్ట్రాటజీ
By: Tupaki Desk | 12 April 2022 8:00 AM ISTబుట్టబొమ్మ పూజా హెగ్డే జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళంలోనూ తన జోరు చూపించేస్తోంది. వరుస క్రేజీ ఆఫర్ల ని దక్కించుకుంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ ని కూడా విస్మయానికి గురిచేస్తోంది. అయితే పూజా హెగ్డే తెలుగు సినిమాలకు ఒకలా తమిళ సినిమాలకు మరోలా డబుల్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్న మాత్రం ఇప్పడు పలువురు ఇండస్ట్రీ వర్గాలని షాక్ కు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే... తెలుగులో 2020, 2021 లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లని సొంతం చేసుకుంది.
ఇందులో ఆమె నటించిన `అల వైకుంఠపురములో` ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సాంగ్స్ దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాల్లో నటించే అవకాశాల్ని కూడా సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ తొలి సారి కలిసి నటించిన `ఆచార్య`లో చరణ్ కు జోడీగా నటించే ఛాన్స్ ని సొంతం చేసుకుంది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి చేసిన `రాధేశ్యామ్` విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన `బీస్ట్` ఈ నెల 13న ఒకే సారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఈ నేపథ్యంలో పూజా హెగ్డేకు సంబంధించిన ఆసక్తికరమైన విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. `బీస్ట్` చిత్రానికి దాదాపు 50 రోజులు కేటాయించిన పూజ ఇందు కోసం మూడున్నరేట్లు తీసుకుందట. హీరో విజయ్ ఈ మూవీ కోసం 70 కోట్లు పారితోషికం గా తీసుకున్నారని ప్రచారం జరగుతోంది. 50 రోజులు కేటాయించిన పూజా ఈ చిత్రానికి గానూ మూడున్నర కోట్లు మాత్రమే డిమాండ్ చేయడం, అంతే కాకుండా హీరోని మించి వరుస ప్రచార కార్యక్రమాల్లో డైరెక్టర్ తో కలిసి పాల్గొనడం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన `రాధేశ్యామ్` చిత్రానికి అంతకు మించి తీసుకున్న పూజా ఇలా `బీస్ట్` కోసం అంత తక్కువ పారితోషికాన్ని తీసుకోవడం ఆమె డబుల్ స్ట్రాటజీని తెలియజేస్తోందని అంటున్నారు. పూజా హెగ్డే తమిళ చిత్రానికి తక్కవ పారితోషికం తీసుకోవడానికి కారణం `బీస్ట్` పూజా హెగ్డేకు తమిళంలో రీఎంట్రీ సినిమా అని, ఆ కారణంగానే అక్కడి వారిని బుట్టలోవేయాన్న ఉద్దేశంతోనే పూజా అలా చేసిందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో కలిసి రోహిత్ శెట్టి రూపొందిస్తున్న `సర్కాస్` చిత్రంలో నటిస్తోంది. అలాగే త్రివిక్రమ్ - మహేష్ ల కలయికలో త్వరలో సెట్స్ పైకి రానున్న చిత్రంలోనూ నటించోతోంది.