Begin typing your search above and press return to search.

పాపం.. పూజా హెగ్డేకు ఎందుకింత అన్యాయం చేశారు?

By:  Tupaki Desk   |   3 April 2022 11:18 AM IST
పాపం.. పూజా హెగ్డేకు ఎందుకింత అన్యాయం చేశారు?
X
బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. ఇటీవ‌ల `రాధేశ్యామ్‌` వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఈ వింటేజ్ ప్రేమ క‌థా చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో పూర్తిగా విఫ‌లం అయింది. దీంతో పూజా ఖాతాలో ఊహించ‌ని విధంగా బిగ్ ఫ్లాప్ వ‌చ్చి ప‌డింది.

అయితే ఈ ఫ్లాప్ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డేందుకు పూజా హెగ్డే ప్ర‌య‌త్నిస్తోంది. ఈమె న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కింది. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించారు.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 13న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర టీమ్‌.. తాజాగా బీస్ట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

చెన్నైలోని ఓ పాపుల‌ర్ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. అదే మాల్ లో గవర్నమెంట్ కి చెందిన టాలెంటెడ్ స్పై ఏజెంట్ విజ‌య్ కూడా ఉంటాడు. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను విజ‌య్ ఎలా రక్షించాడు..? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ల‌ను ఎదుర్కొన్నాడు..? అన్న‌దే సినిమా. ట్రైల‌ర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపించిన విజ‌య్‌.. ఎప్ప‌టిలాగానే త‌నదైన న‌ట‌న‌తో మిస్మ‌రైజ్ చేశాడు.

మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ, పూజా హెగ్డేను మాత్రం దారుణంగా విస్మరించారు. దాదాపు మూడు నిమిషాల ఉన్న ట్రైల‌ర్‌లో పూజాను క‌నీసం మూడు సెకెండ్లు కూడా చూపించ‌లేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డేకి ఎందుకింత అన్యాయం చేశారంటూ డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్ కుమార్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరుగుతున్నారు.