Begin typing your search above and press return to search.
పెద్ద పులి తొడుగులో పూజాహెగ్డే!
By: Tupaki Desk | 20 May 2022 11:00 PM ISTముంబై బ్యూటీ పూజాహెగ్డే కేన్స్ ఉత్సవాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డిజైనర్ దుస్తుల్లో అమ్మడు కేన్స్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. సొగసు చూడతరామా అన్న చందంగా బుట్టబొమ్మ రెడ్ కార్పెట్ పై హొయలు పొతుంది. అయితే ఇప్పటి వరకూ అమ్మడ్ వావ్ అనిపించే డిజైనర్ లో మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా పూజాహెగ్డే కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అమ్మడు పెద్ద పులి అవతారంలో కనిపిస్తుంది. బెంగాల్ టైగర్ చర్మం పై ఉండే నలుపు..పసుపు చారల తొడుగు కొట్ ధరించి కెమెరాకి ఫోజులిచ్చింది. ముఖాన్ని కూడా అదే తొడుగుతో కవర్ చేసి ఉంటే పెద్ద పులి గంభీరంగా ఉందా? అన్న సందేహం రాక మానదు.
సాయంసంధ్యా వేళలో చీకటి కమ్ముకొస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. దీంతో స్పాట్ లైట్ లో పులితొడుగు మరింత ప్రకాశంతంగా మెరుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు డిజైనర్ కోట్ ని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడు గ్లామర్ షోతో అలరించే పూజాహెగ్డే ఇలా ఒళ్లంతా కప్పేసుకుని కనిపించే సరికి ఎవరా? అని స్టన్ అవుతున్నారు ఫ్యాన్స్.
పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే నటిగా బిజీగా ఉంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. `సిర్కస్`..`కబీ ఈద్ కబీ దివాళీ` లో నటిస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. మహేష్ తో నటించడం ఇది రెండవసారి. గతంలో `మహర్షి` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు `ఎఫ్ 3`లో ఐటం బాంబ్ గానూ అలరించబోతుంది. ఇప్పటికే జిగేల్ రాణిగా టాలీవుడ్ యూత్ ని ఊపేసిన సంగతి తెలిసిందే. పూజా నటించిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. `రాధేశ్యామ్`.. `ఆచార్య`..`బీస్ట్ `మూడు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి చతికిల పడినవే. దీంతో పూజాహెగ్డేకి సక్సెస్ అనివార్యమైన సమయం ఆసన్నమైనట్లు సంకేతాలు అందుతున్నాయి.