Begin typing your search above and press return to search.
చరణ్ సీక్రెట్ ఒకటి నాకు తెలిసిపోయింది: పూజ హెగ్డే
By: Tupaki Desk | 24 April 2022 3:00 PM ISTటాలీవుడ్లో పూజ హెగ్డే ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల ఆమె నుంచి వరుస సినిమాలు థియేటర్లకు వస్తుండటం విశేషం. ప్రభాస్ తో చేసిన 'రాధే శ్యామ్' .. విజయ్ తో చేసిన 'బీస్ట్' చాలా తక్కువ గ్యాపులో థియేటర్లకు వచ్చాయి. అలాగే ఈ నెల 29వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి 'ఆచార్య' రెడీ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా ఆమె 'నీలాంబరి' పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూజ హెగ్డే ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ శారీలో మెరిసింది.
ఈ వేదికపై పూజ హెగ్డే మాట్లాడుతూ .. "మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ ఈవెంట్ కి వచ్చారు. వాళ్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఫంక్షన్ కి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 'ఆర్ ఆర్ ఆర్'తో సౌత్ ఇండియా సినిమా స్థాయిని మరింత పెంచిన రాజమౌళి గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. ముంబై వాళ్లంతా కూడా సౌత్ ఇండియా సినిమాను గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది.
మా దర్శకుడు కొరటాల శివగారి విషయానికి వస్తే కామ్ అండ్ కూల్. వెరీ సాఫ్ట్ స్పోకెన్ డైరెక్టర్. నాలో 'నీలాంబరి'ని చూసుకుని .. ఆ పాత్రను నాకు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. చిరంజీవి గారి విషయానికి వస్తే , సహజంగానే ఆయనలో ఒక రకమైన స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. సెట్లో కూడా ఆయన అదే స్టైల్ తో కనిపిస్తూ ఉంటారు. ఆయనలోని ఆ స్టైల్ .. హుందాతనం .. కూల్ గా ఉండటం నాకు బాగా నచ్చుతాయి.
చరణ్ విషయానికి వస్తే .. సినిమాకి .. సినిమాకి మరింత బెటర్ అవుతూ వస్తున్నారు. సెట్లో ఆయన చాలా కామ్ గా ఉంటారు. ఆ సీక్రెట్ ఏంటో ఆ తరువాత నాకు అర్థమైంది. కేవలం యాక్షన్ అన్నప్పుడు మాత్రమే తనలోని ఎనర్జీని ఉపయోగిస్తారన్న మాట. మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. 'ధర్మస్థలి' సెట్ ను ఎంతో అందంగా .. అద్భుతంగా తీర్చిదిద్దారు. 'ఆచార్య' కథ వినగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.