Begin typing your search above and press return to search.

పాయ‌ల్ ఉతికి ఆరేసిందిగా

By:  Tupaki Desk   |   25 Jan 2019 5:30 PM GMT
పాయ‌ల్ ఉతికి ఆరేసిందిగా
X
న‌టించిన తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది పాయ‌ల్ రాజ్ పుత్. వేడెక్కించే ఔట్ డోర్ (అర‌టితోట‌) స‌న్నివేశాలు, ఘాటైన రొమాన్స్ తో మైమ‌రిపించింది. ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డు కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. టాలీవుడ్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోంది. అలాగే అటు త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్ స‌ర‌స‌న న‌టించేస్తోంది.

ఈ సినిమాలు సెట్స్ పై ఉండ‌గానే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సంత‌కం చేశాన‌ని పాయ‌ల్ తెలిపింది. మ‌రోవైపు మాతృభాష పంజాబీలో క్ష‌ణం తీరిక లేనంత బిజీ స్టార్ గా వెలిగిపోతోంది. అటుపై హిందీ మార్కెట్ పైనా పాయ‌ల్ క‌న్ను ప‌డింద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గానే పాయ‌ల్ సోష‌ల్ మీడియాలో నిరంత‌రం త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటూ కంటిపై కునుకు క‌రువ‌య్యేలా చేస్తోంది. ఇన్ స్టా లో రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోల్ని అప్ లోడ్ చేస్తూ వాటికి ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని ఇస్తోంది.

ఇదివ‌ర‌కూ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన ఫోటోల్ని అప్ లోడ్ చేస్తే క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోయాయి. తాజాగా సాగర తీరంలో సాగ‌ర‌క‌న్య‌గా మారి జ‌ల‌కాలాడుతున్న ఫోటోల్ని పాయ‌ల్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో పాయ‌ల్ ఇచ్చిన ఫోజులు యూత్ ని క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అభిమానుల‌ సామాజిక మాధ్య‌మాల్లో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోతున్నాయి. ``మీకు మీరే మ్యాగ్జిమ‌మ్ ఆస్వాధించండి`` అన్న క్యాప్ష‌న్ తో బ్లాక్ క‌ల‌ర్ టూపీస్ లో రెచ్చ‌గొట్టింది. పాయ‌ల్ ఇదే తీరుగా పెద్ద తెర‌పైనా చెల‌రేగిపోతే అన‌తి కాలంలోనే పెద్ద స్టార్ అయిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆర్‌.ఎక్స్ 100 బ్యూటీ ర‌గ్గ్‌డ్ రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ లా .. పిక‌ప్ తో దూసుకుపోతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి కాదు.