Begin typing your search above and press return to search.

మగాడి అవసరమే లేదంటున్న బిగ్ బాస్ స్టార్

By:  Tupaki Desk   |   6 July 2019 11:52 AM IST
మగాడి అవసరమే లేదంటున్న బిగ్ బాస్ స్టార్
X
బిగ్‌ బాస్‌ తో తమిళంలోనే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం ఫేమస్‌ అయిన ముద్దుగుమ్మ ఓవియా. సెన్షేషనల్‌ తారగా గుర్తింపు దక్కించుకున్న ఓవియా ఇటీవలే '90 ఎంఎల్‌' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినా కూడా ఓవియా ధైర్యంగా తన సినిమాను ప్రమోట్‌ చేసుకుంది. తాజాగా ఈమె 'కలవాణి 2' చిత్రంలో నటించింది. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ఓవియా మాట్లాడుతూ.. నా అసలు పేరు హెలన్‌. నా పేరును ఓవియాగా మార్చింది దర్శకుడు సర్గుణం. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో కలవాణి 2 చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను మహిళ సంఘం నాయకురాలిగా నటించాను. నా నిజ జీవిత స్వభావంకు ఈ చిత్రంలోని నేను పోషించిన పాత్రకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి అంది.

పెళ్లి గురించి అడిగిన సందర్బంలో ఓవియా.. ప్రస్తుతం నేను స్వేచ్చా జీవిని. నాకు వివాహ బంధంపై అసలు నమ్మకం లేదు. కాబట్టి నేను పెళ్లి అనేదాన్ని నమ్మడం లేదు. అసలు పెళ్లితో పనే లేదు. పెళ్లి చేసుకోకుండా స్వాతంత్య్ర భావాలతో బతకాలని నేను కోరుకుంటున్నాను. మగతోడు అవసరం మహిళకు అక్కర్లేదని తాను నిరూపించదల్చుకున్నట్లుగా ఓవియా చెప్పుకొచ్చింది. ఇక తనకు ప్రత్యేకంగా స్నేహితులు ఏమీ ఉండరని.. అందరితో తాను ఒకే విధంగా మసులుకుంటాను. నాకు నచ్చని వారితో మాట్లాడను నచ్చితే మాట్లాడతాను. అంతే తప్ప స్నేహం చేయడం కొందరిని అసహించుకోవడం వంటివి తాను చేయనంది. భవిష్యత్తులో సూపర్‌ ఉమెన్‌ పాత్రలో నటించే ఛాన్స్‌ వస్తే సంతోషంగా చేస్తానంటోంది ఓవియా.