Begin typing your search above and press return to search.

అబ్బాయిలపై నివేదా కామెంట్.. పుస్తకాల్లో మాత్రమే అంటూ..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:30 PM GMT
అబ్బాయిలపై నివేదా కామెంట్.. పుస్తకాల్లో మాత్రమే అంటూ..!
X
కోలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తన సినిమాలతో అలరిస్తూ రెగ్యులర్ ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాల కన్నా తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా సందడి ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక రేసర్ గా కూడా తనకు ఉన్న టాలెంట్ ను కూడా చూపిస్తుంది నివేదా. ఫోటో షూట్స్ విషయంలో నివేదా పేతురాజ్ మాత్రం ఒక స్పెషాలిటీ చాటుతుంది.

అదేంటి అంటే మామూలుగా అయితే అందరు హీరోయిన్స్ ఫోటో షూట్స్ అంటే ఓ రేంజ్ లో రెడీ అయ్యి చేస్తారు. అంతేకాదు రకరకాల కాస్టూమ్స్ తో ఫోటో షూట్స్ చేస్తారు. కానీ నివేదా పేతురాజ్ మాత్రం కేవలం తన నేచురల్ లుక్స్ తో ఫోటో షూట్ చేస్తుంది. నో మేకప్ స్టిల్స్ తో అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోస్ ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా నివేదా ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది.

అందులో విషయం ఏంటంటే ఆమె వేసుకున్న టీ షర్ట్ మీద కొటేషన్ అబ్బాయిల గురించి కామెంట్ చేస్తూ ఉంది. ఇంతకీ నివేదా టీ షర్ట్ మీద ఏమని రాసుంది అంటే అబ్బాయిలంతా కేవలం పుస్తకాల్లో మాత్రమే బాగుంటారని రాసి ఉంది. ఈ కొటేషన్ తో నివేదా ఎవరిని టార్గెట్ చేసింది అన్నది ఎవరికీ అర్ధం కావట్లేదు.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వస్తుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ధంకీ సినిమా చేస్తుంది నివేదా పేతురాజ్. ఈ సినిమాలో కెరీర్ లో ఫస్ట్ టైం గ్లామర్ షోలో కూడా అదరగొట్టేసింది అమ్మడు. విశ్వక్ సేన్ తో ఈమధ్య క్లోజ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది నివేదా. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న నివేదా పేతురాజ్ సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా ఇక్కడ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.