Begin typing your search above and press return to search.

జయలలిత సాక్షిగా.. నయన్ కన్ఫామ్

By:  Tupaki Desk   |   6 Dec 2016 10:03 PM IST
జయలలిత సాక్షిగా.. నయన్ కన్ఫామ్
X
సర్లేండి.. ఇక మీదట టాప్ హీరోయిన్ నయనతారపై వచ్చే రూమర్లన్నీ ఆపేయొచ్చేమో. ఎందుకంటే ఎక్కడ కన్ఫామ్ చేయాలో అక్కడే కన్ఫామ్ చేసేసింది ఈ అమ్మడు. పైగా వేలమంది మధ్యలో అంత క్లారిటీ ఇచ్చాక ఇక ఎవ్వరూ ఈమెను ఏమీ అడగరులే.

తమిళనాడు ముఖ్యమంత్రి.. మాజీ హీరోయిన్.. దివంగత జయలలిత పార్ధివ దేహాన్ని దర్శించుకోవడానికి ఈరోజు అనేకమంది సినిమా సెలబ్రిటీలు క్యూలు కట్టిన సంగతి తెలిసిందే. అయితే అక్కడకు బెంగుళూరులో షూటింగ్ చేస్తున్న నయనతార కూడా అర్ధంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ విచ్చేసిందట. ఇక జయలలిత దేహాన్ని తన ప్రియుడు.. దర్శకుడు విఘ్నేష్‌ శివన్ తో కలసి దర్శించుకుంది. ఇద్దరూ కూడా తెల్ల బట్టల్లో నార్త్ ఇండియన్ స్టయిల్లో విచ్చేశారులే.

అయితే ఇలాంటి ఓ కార్యక్రమానికి ఎవ్వరూ కూడా లవర్స్ తో కలసి రారు. వారి మధ్యన అంతకుమించి రిలేషన్ ఉంటేనే.. అలా కలసి నలుగురు ముందు దర్శనమిస్తారు. అంటే రూమర్లలో వింటున్నట్లు నిజంగానే విఘ్నేష్‌ ను నయన్ పెళ్ళిచేసుకుందని కన్ఫామ్ చేసుకోవచ్చు మనం.. అంటున్నారు సినీ అభిమానులు. సర్లేండి.. నిజాలు ఏంటనేది నయనే చెప్పాలి.