Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఓ జెమ్..ఆయ‌నొక ప‌వ‌ర్ హాస్ పెర్మార్మ‌ర్: న‌య‌న‌తార‌

By:  Tupaki Desk   |   10 Oct 2022 7:00 AM IST
మెగాస్టార్ ఓ జెమ్..ఆయ‌నొక ప‌వ‌ర్ హాస్ పెర్మార్మ‌ర్: న‌య‌న‌తార‌
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `గాడ్ ఫాద‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న‌టి రోజున నిర్వ‌హించిన‌ స‌క్సెస్ మీట్ తో ఆ దుమారం రెట్టింపు అయింది. తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా మెగాస్టార్  హాట్ టాపిక్ గా మారారు. ఏనోట విన్నా..ఏ చోట ఉన్నా గాడ్ ఫాద‌ర్ టాపిక్ త‌ప్ప మ‌రో చ‌ర్చ లేదు. అంత‌గా గాడ్ పాద‌ర్ జ‌నాల్లో వైర‌ల్  గా మారింది.

`ఆచార్య` ఏ రేంజ్లో విమ‌ర్శ‌లు మూటగ‌ట్టుకుందో? అంత‌కంత‌కు రెట్టింపు ప్ర‌శంస‌లు గాడ్ ఫాద‌ర్ దక్కించుకుంటుంది. ఒకే హీరో రెండు సినిమాలు రిలీజ్ అయి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే? ఎంత‌టి ఇంపాక్ట్ ఉంటుందో? అంత‌టి ప్ర‌భావం సింగిల్  `గాడ్ ఫాద‌ర్`  తో క‌నిపిస్తోంది. ఇక సినిమా స‌క్సెస్ గురించి నిన్న‌టి రోజున వ‌క్తలంతా ఏ రేంజ్ లో వ‌ల్లించారో చెప్పాల్సిన ప‌నిలేదు.

చాలా కాలం త‌ర్వాత మెగా మూవీకి వ‌చ్చిన గొప్ప ప్ర‌శంస‌ల‌వి. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ ని పుర‌స్క‌రించుకుని ఇందులో హీరోయిన్ గా న‌టించిన న‌య‌న‌తార సైతం త‌న సంతోషాన్ని పంచుకోకుండా ఉండలేక‌పోయారు. ఆమె భావోద్వేగ కృత‌జ్ఞ‌తా లేఖ ఒక‌టి రిలీజ్ చేసారు.

`గాడ్‌ఫాదర్ని` భారీ బ్లాక్‌బస్టర్ చేసినందుకు సినీ ప్రేమికులందరికీ మరియు నా అభిమానులకు ధన్యవాదాలు.మీరందరూ మా చిత్రాన్ని థియేటర్‌లో మీ ప్రియమైన వారితో చూడ‌టం  చాలా ఆనందంగా ఉంది. `గాడ్ ఫాదర్` నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఇందులో పాల్గొన్న వ్యక్తులు మరియు దాని వెనుక ఉన్న అద్భుతమైన బృందమే కారణం.

మెగాస్టార్ చిరంజీవిగారితో మరోసారి స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ఆయన ఒక జెమ్ మరియు పవర్‌హౌస్ పెర్ఫార్మర్. ఆయనతో సెట్‌లో ఉన్న ప్రతి క్షణం ఎంతో ఆనందించాను. అందుకు చిరంజీవి గారికి ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు.
నన్ను  విశ్వసించి.. మూడవసారి నాతో కలిసి పనిచేసినందుకు దర్శకుడు మోహన్ రాజాగారికి నా కృతజ్ఞతలు.`

సత్యప్రియ` అనేది ఒక లేయర్డ్ మరియు కాంప్లెక్స్ క్యారెక్టర్.  నాపై నా డైరెక్టర్‌కి ఉన్న నమ్మకం వల్లే  ఇది సాధ్య‌మైంది.ప్రతి ఒక్కరూ సల్మాన్ ఖాన్ సార్‌ను ప్రేమిస్తారు.  స‌ల్మాన్ సార్ న‌టించ‌డం  ఈసినిమాకి పెద్ద అస్సెట్ గా నిలిచింది. అందుకు ఆయ‌న‌కు  ధన్యవాదాలు సర్. నా నటనను తీర్చిదిద్ది. నన్ను మంచి నటిగా మార్చిన నా సహనటులందరిపై నా ప్రేమ  గౌరవం  ఎప్పుడూ ఉంటాయి.

`గాడ్ ఫాదర్` అనే  ప్రపంచానికి మీ నైపుణ్యం మరియు ప్రతిభను అందించినందుకు సంగీత దర్శకుడు థమన్ మరియు సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా సర్ కి ధన్యవాదాలు. ఇంత భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినందుకు R.B. చౌదరి సార్ -N.V. ప్రసాద్ సర్‌లకు నా కృతజ్ఞతలు. ఏ నటుడైనా.. సాంకేతిక నిపుణుడైనా మీతో పని చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగా ఉంటారు.

సూపర్ గుడ్ ఫిల్మ్స్ 100 చిత్రాల మ్యాజికల్ మార్క్‌కు చేరువైనందుకు హృదయపూర్వక అభినందనలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. చివరగా పండుగల సీజన్‌లో ఇంతటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన ప్రేక్షకులకు మరొక్క‌సారి కృతజ్ఞతలు తెలుపుతూ న‌య‌న్ లేఖ‌కి ముగింపు ప‌లికారు. ప్ర‌స్తుతం ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఓ సినిమాని ప్ర‌శంసిస్తూ ఇలా  లేఖ రాయ‌డం న‌య‌న్ కెరీర్ లో ఇదే మొద‌టిసారి.