Begin typing your search above and press return to search.

ఎంత సంతోషంగా ఉందో చూశారా?

By:  Tupaki Desk   |   9 Aug 2016 8:23 AM GMT
ఎంత సంతోషంగా ఉందో చూశారా?
X
మన్నారా చోప్రా.. టాలీవుడ్ కి ఈ భామ కొత్తేం కాదు కానీ ఈ పేరే కాస్త కొత్త. రెండేళ్ల క్రితం ప్రేమ గీమ జాన్తా నై అంటూ టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించినా.. మన జనాలు పట్టించుకునేది జాన్తా నై అనేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఓ సినిమా.. కోలీవుడ్ లో రెండు సినిమాలు చేసి మళ్లీ తెలుగులోకి వచ్చేసింది.

చూసేందుకు కాసింత బొద్దుగా అనిపిస్తున్నా.. కొలతల విషయంలో గట్టిగానే మెయింటెయిన్ చేస్తోంది మన్నారా. దీనికి తోడు అటు పద్ధతిగా ఉండే పాత్రలకు.. ఇటు గ్లామర్ రోల్స్ కి సరిపోయే ఫిగర్ కావడంతో.. ఈమెకు ఆఫర్ ఇచ్చే విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండడం లేదు. ఇప్పటికే జక్కన్నతో సక్సెస్ సాధించిన ఈభామకి.. ఇప్పుడు తిక్క కూడా మరో హిట్ ఇచ్చిందంటే.. ఇక కెరీర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని ఉండదని టాక్.

రీసెంట్ గా విడుదలైన సునీల్ జక్కన్న మూవీలో హీరోయిన్ ఈ మన్నారా చోప్రానే. ఈ వారంలో విడుదలవుతున్న సాయి ధరం తేజ్ మూవీ తిక్కలో కూడా హీరోయిన్ గా నటించింది. జక్కన్న అనూహ్యంగా సక్సెస్ సాధించేసింది. ఇప్పుడు తిక్కపై కూడా అంచనాలు ఇలానే ఉన్నాయి. అందుకే తన సంతోషాన్ని ఫోటోలకు పోజులిచ్చి మరీ చాటి చెబుతోంది మన్నారా చోప్రా అలియాస్ బార్బీ హండా.