Begin typing your search above and press return to search.

నా ఇష్టం అంటూ..బాగానే దింపిందిగా కౌంటర్లు!

By:  Tupaki Desk   |   16 May 2020 2:45 PM IST
నా ఇష్టం అంటూ..బాగానే దింపిందిగా కౌంటర్లు!
X
ఇటీవల లాక్ డౌన్ లో జరుగుతున్న సినీ సెలబ్రిటీల పెళ్లిళ్ల పై వివాదాస్పదంగా కామెంట్స్ చేస్తూ.. నెట్టింట్లో నిలిచింది హీరోయిన్, బీజేపీ మహిళ నాయకురాలు మాధవి లత. మే 14న శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో కొద్దిమంది అతిథుల మధ్య నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి జరిగింది. అలాగే అదే రోజు అదే ముహూర్తానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహేష్ పెళ్లి కూడా జరిగింది. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఈ జంటలు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌ల టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు కూడా సడన్ గా రాత్రి వేళ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ లాక్ డౌన్ లో జరుగుతున్న పెళ్లి తంతుల పై.. మాధవీలత తనదైన శైలిలో కాస్త ఘాటుగా స్పందించింది.

ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. "అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని మరి పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అది కాక‌పోతే మేఘమాసం.. లేదంటే మరొక సంవత్సరం. అంతేగాని మళ్లీ పిల్ల దొరకదా.. పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకట‌? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని సంసారాలు చేస్తారా? ఫిక్స్ అయిన మ్యారేజ్‌లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా.. ఈ పెళ్లి ఏంటో.. నాకర్థం కావట్లేదు. పీపుల్ మస్ట్ బి క్రేజీ..నో..నో.. గాడ్ మ‌స్ట్ బి క్రేజీ" అంటూ పోస్ట్ చేసింది. ఇక ఎండింగ్ లో "నా పోస్ట్ నా ఇష్టం. నా ఒపీనియన్ నేను చెప్తా. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది" ఓ కొసమెరుపు వ్యాఖ్య వదిలింది. ఇక ఏదొక కారణం చెప్పి త్వరగా కానిస్తే మాత్రం.. వాళ్ల మధ్య సరైన అవగాహన లేదని మాధవి స్ట్రాంగ్ గా చెప్పేసింది.