Begin typing your search above and press return to search.
సీబీఐ పేరుతో మాజీఎంపీని బ్లాక్ మెయిల్ చేసిన నటి!
By: Tupaki Desk | 17 Jun 2020 9:30 AM ISTటీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మస్కా కొట్టిన కిలేడి హీరోయిన్ ను సీబీఐ అధికారులు గుర్తించారు. రాయపాటినే బ్లాక్ మెయిల్ చేసింది ఓ హీరోయిన్ అని తేల్చారు.
సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మాజీ ఎంపీ రాయపాటికి కాల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రాయపాటిపై ఉన్న కేసులు మాఫీ చేస్తామని నమ్మించారు. దీనిపై అనుమానం వచ్చిన రాయపాటి వెంటనే సీబీఐకి ఫిర్యాదు చేశారు.
దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు ఫోన్ కాల్ చేసింది మలయాళ నటి లీనా మోరియాపాల్ అని గుర్తించినట్టుగా సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో లీనా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుంది.
గతంలో కూడా లీనా మారియా పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఓ బ్యాంకును మోసం చేసి రూ.19 కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. లీనాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ తరుణంలోనే రాయపాటికి సీబీఐ అధికారి పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించిన కేసులో మరో కేసు నమోదైంది.
