Begin typing your search above and press return to search.

ఉన్నది ఒక కిడ్నీ అయినా ఆనందంగానే ..చివరికి బుల్లి తెర నటి కన్నుమూత..!

By:  Tupaki Desk   |   23 Nov 2020 9:45 AM IST
ఉన్నది ఒక కిడ్నీ  అయినా   ఆనందంగానే ..చివరికి  బుల్లి తెర నటి కన్నుమూత..!
X
ప్రముఖ బుల్లితెర నటి లీనా ఆచార్య (30) అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్న వయసు లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన లీనా అనారోగ్యం తో మరణించారు. ఆమె మృతితో ముంబైలోని టీవీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే టీవీ రంగం లోకి వచ్చి రాణించిన లీనా .. కన్నుమూయడం ఎంతో బాధాకరమని టీవీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. క్లాస్ ఆఫ్ 2020, సేట్ జీ వంటి, ఆప్‌కే ఆజానేసే, మేరీ హానికారక్ బీవీ వంటి టీవీ కార్యక్రమాలతో లీనా ఆచార్య పాపులర్​ అయ్యారు. ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సమస్య బాధపడుతున్నది. ఇటీవలే ఢిల్లీలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రి లో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతికి ప్రముఖ టీవీ నటుడు ఆమెతో కలిసి నటించిన రోహన్ మెహ్రా, మరో నటుడు ఆయుష్ ఆనంద్ సంతాపం తెలిపారు.

అయితే ఆమెకు చాలా కాలంగా కిడ్నీ సమస్య ఉన్నదని లీనా సోదరుడు చెప్పారు. అయితే లీనా మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అందరితో సరదాగా ఉండేవారు. ఆమె ఎప్పుడూ తన ఆరోగ్యసమస్య గురించి చెప్పుకోలేదని ఆమె తో కలిసి పనిచేసిన వారు అంటున్నారు. ఇంత చిన్నవయసులో ఆమెకు చనిపోవడం షాక్​కు గురిచేసిందని వాళ్లు చెబుతున్నారు. ఆమె సెట్ ​లో అందరితో నవ్వుతూ మాట్లాడేవారని ఎప్పుడు తన ఆరోగ్య సమస్య గురించి చెప్పలేదని వారు పేర్కొన్నారు. ఆమె మృతికి పలువురు టీవీ, సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.