Begin typing your search above and press return to search.

ల‌య వ‌స్తోంది... కూతురినీ తెస్తోంది!!

By:  Tupaki Desk   |   5 April 2018 3:30 PM GMT
ల‌య వ‌స్తోంది... కూతురినీ తెస్తోంది!!
X
ల‌య‌... టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు లేరు... అనుకుంటున్న స‌మ‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీలో మెరిసిన తెలుగు తార. తెలుగులో ప‌ర‌భాషా హీరోయిన్లు పెరిగిపోయి... రాజ్య‌మేలుతున్న ఈ త‌రం హీరోయిన్ల‌లో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగ‌మ్మాయి ల‌య‌నే. పెళ్లి చేసుకుని సినిమాల‌కి వీడ్కోలు చెప్పిన ఆమె... ఇప్పుడు మ‌ళ్లీ తెర మీద‌కి తిరిగొస్తోంది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

ల‌య‌కి ఇది రెండో ఇన్నింగ్స్ అయితే... ఆమె కూతురు శ్లోకాకి మొద‌టి ఇన్నింగ్స్. అవును... ల‌య కూతురు శ్లోకా కూడా ఈ సినిమాతో టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగ్రేటం చేస్తోంది. 1992లో వ‌చ్చిన ‘భ‌ద్రం కొడుకో’ అనే సినిమాతో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చిన ల‌య‌... వేణు తొట్టెంపూడి హీరోగా వ‌చ్చిన ‘స్వ‌యం వ‌రం’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తొలిసారి క‌థ‌.. మాట‌లు అందించిన సినిమా ఇదే. ఆ త‌ర్వాత వ‌రుస‌గా శ్రీ‌కాంత్‌- జ‌గ‌ప‌తిబాబు- అర్జున్‌- శివాజీ వంటి హీరోల‌తో జోడిక‌ట్టిన ల‌య‌... విజ‌యేంద్ర వ‌ర్మ సినిమాలో బాల‌య్య‌బాబు స‌ర‌స‌న ఆడిపాడింది. తెలుగుతో పాటు త‌మిళం- క‌న్న‌డ‌- మ‌ల‌యాళ సినిమాల్లో క‌నిపించిన ల‌య‌... శివాజీ న‌టించిన ‘బ్ర‌హ్మ‌లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం’ సినిమాలో చిన్న అతిథి పాత్ర‌లో క‌నిపించింది.

ర‌వితేజ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ సినిమాను శ్రీ‌నువైట్ల తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ల‌య పెళ్ల‌యిన త‌ర్వాత అమెరికాలోనే సెటిలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం అక్క‌డే జ‌రుపుకోబోతోంది. దాంతో ఈ సినిమాలో న‌టించేందుకు ల‌య ఒప్పుకుంద‌ని టాక్‌. మ‌రి వేరే సినిమా అవ‌కాశాలు వ‌స్తే ఒప్పుకుంటుందా.. లేదా! తెలీదు. ఇంత‌కు ముందు త్రివిక్ర‌మ్‌- ఎన్టీఆర్ సినిమాలోనూ ల‌య‌ను న‌టింప‌చేయాల‌ని చూశార‌ని... దానికామె ఒప్పుకోలేద‌ని టాక్ వినిపించింది.