Begin typing your search above and press return to search.

స్వ‌యంవ‌రం బ్యూటీ ఫ్యామిలీ పిక్ వైర‌ల్!

By:  Tupaki Desk   |   10 Jan 2022 2:30 AM GMT
స్వ‌యంవ‌రం బ్యూటీ ఫ్యామిలీ పిక్ వైర‌ల్!
X
అల‌నాటి తెలుగు హీరోయిన్ ల‌య సుప‌రిచితురాలే. బాల న‌టిగా ప‌రిచ‌య‌మైన బ్యూటీ అటుపై హీరోయిన్ గా ప్ర‌మోట్ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. న‌టిగా త‌న‌కూంటో ఓ గుర్తింపు..మార్క్ ని వేసుకుంది. `స్వ‌యంవ‌రం` తో మొద‌లైన ఆమె ప్ర‌స్థానం ద‌శౄబ్ధం పాటు దిగ్విజ‌యంగా కొన‌సాగింది. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించింది. అయితే పెళ్లి త‌ర్వాత ల‌య సినిమాల‌కు దూర‌మైంది. పూర్తిగా కుటుంబ జీవితానికే అంకిత‌మైంది. పెళ్లి త‌ర్వాత అమెరికా వెళ్లిపోయి..భ‌ర్త‌..పిల్ల‌లు అంటే కొత్త ప్ర‌పంచంలోకి వెళ్లిపోయింది.

అయితే ఎనిమిదేళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ మాస్ రాజా ర‌వితేజ క‌థానాయకుడిగా న‌టించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` చిత్రంతో కంబ్యాక్ అయింది. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. దీంతో ల‌య‌కు అవ‌కాశాలు రాలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ అంత సాఫీగా సాగ‌లేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ల‌య కుటుంబంతో ఎక్క‌డ ఉంటుంద‌న్న‌ది క్లారిటీ లేదుగానీ తాజాగా ల‌య ఫ్యామిలీ వెకేష‌న్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గామారాయి. ల‌య భ‌ర్త‌..పిల్ల‌లు డ్రెస్ కోడ్ పాటించారు. ల‌య..ఆమె కుమార్తె పింక్ క‌ల‌ర్ టీష‌ర్ట్...బ్ల జీన్స్ ధ‌రించారు. ఇక ల‌య భ‌ర్త‌..కుమారుడు జీన్స్..టీష‌ర్ట్ ధ‌రించి అంతా ఒకే ప్రేమ్ లో ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక ల‌య కంబ్యాక్ అవ్వాలంట ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. వెండితెర‌పై త‌మ హీరోయిన్ ని చూసుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. అభిమానుల కోరిక ఫ‌లించాల‌ని ఆశిద్దాం.