Begin typing your search above and press return to search.

ఇలియానా చిన్నప్పటి పాత్రలో స్టార్‌ కూతురు!!

By:  Tupaki Desk   |   16 Nov 2018 6:01 AM GMT
ఇలియానా చిన్నప్పటి పాత్రలో స్టార్‌ కూతురు!!
X
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌ గా రాణించడం చాలా కష్టం అయ్యింది. తెలుగమ్మాయిు హీరోయిన్స్‌గా రాణించడం అసాధ్యం అనుకుంటున్న సమయంలో స్వయంవరం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు అమ్మాయి లయ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌ గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే లయ ఒక అమెరికన్‌ ఎన్నారైను వివాహం చేసుకుని అక్కడకు వెళ్లి పోయింది. ఆ తర్వాత మళ్లీ లయ రీ ఎంట్రీ అంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాలేదు. తాజాగా ఆమె కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

నేడు విడుదలైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. ఇలియానా పాత్ర అమెరికాలో పుట్టి పెరుగుతుంది. అందుకే ఇలియానా చిన్నప్పటి పాత్ర కోసం ఒక ఎన్నారై పాపను ఎంపిక చేయాలని భావించాడట శ్రీనువైట్ల. ఆ సమయంలోనే లయ కూతురును ఇలియానా పాత్రకు తీసుకుంటే బాగుంటుందని కొందరి సలహా మేరకు ఆమెను సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడంతో షూటింగ్‌ లో లయ కూతురు పాల్గొంది.

అమెరికాలోనే పుట్టి పెరిగిన లయ కూతురు తెలుగు కూడా చక్కగా మాట్లాడగలుగుతుందట. అందుకే ఈ పాత్రకు ఆ పాప చక్కగా సూట్‌ అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. నేడు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో లయ కూతురుకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. రవితేజ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.