Begin typing your search above and press return to search.
బ్యాడ్ గాళ్ ని వదల బొమ్మాళీ అంటున్న ED
By: Tupaki Desk | 28 Jun 2022 8:00 AM IST`సాహో` చిత్రంలో బ్యాడ్ బోయ్ సాంగ్ తో జాక్విలిన్ కి తెలుగు నాటా గొప్ప ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో అవకాశాల వేట సాగిస్తోంది. కానీ ఇంతలోనే రూట్ మారింది. ఇటీవల కాన్ మాన్ సుఖేష్ చంద్ర స్కామ్ లో జాకీ పేరు ప్రముఖంగా వినిపించడం తన కెరీర్ పై ప్రభావం చూపింది. అతడితో జాక్విలిన్ సాన్నిహిత్యం కానుకల వ్యవహారం.. ఈడీ దర్యాప్తు.. రికవరీ వగైరా తెలిసినదే.
`కాన్ మ్యాన్` కేసులో విచారణ నిమిత్తం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోమవారం ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరై మనీలాండరింగ్ కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని తెలిసింది. ఏప్రిల్ లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద జాక్విలిన్ నుంచి రూ.7.27 కోట్ల నిధులను ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. 36 ఏళ్ల జాకీని గతంలో ఈడీ రెండు మూడు సార్లు ప్రశ్నించింది.
ఈ కేసులో మిగిలిన నేరాల ఆదాయాన్ని ఏజెన్సీ ట్రేస్ చేస్తున్నందున సోమవారం ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయడానికి సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. 15 లక్షల నగదుతో పాటు రూ. 7.12 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసినందుకు ఆమెపై ప్రొవిజనల్ ఆర్డర్ జారీ చేసారు. ఎందుకంటే ఏజెన్సీ ఈ నిధులను ``క్రైమ్ ప్రొసీడ్స్``గా పేర్కొంది.
సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీ సహా నేర కార్యకలాపాల ద్వారా సృష్టించిన సొమ్ము నుండి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు రూ. 5.71 కోట్ల విలువైన వివిధ బహుమతులు ఇచ్చాడు. అతడు జాకీకి చిరకాల సహచరుడు. ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న పింకీ ఇరానీ ఆమెకు బహుమతుల్ని అందించడానికి అతడు నియమించాడు అని ED ఒక ప్రకటనలో పేర్కొంది. జాకీకి ఈ బహుమతులతో పాటు తన కుటుంబ సభ్యులకు 172913 (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం సుమారు రూ. 1.3 కోట్లు) అమెరికా డాలర్లను 26740 (సుమారు రూ. 14 లక్షలు) ఆస్ట్రేలియా డాలర్లను కూడా ఇచ్చాడు. అతడు అంతర్జాతీయ హవాలా ఆపరేటర్ అయిన అవతార్ సింగ్ కొచ్చర్ అనే సహ నిందితుడిని ఆపరేట్ చేసాడు. జాకీ కోసం వెబ్ సిరీస్ స్క్రిప్ట్ ను రాసేందుకు రచయితకు 15లక్షలు సుఖేష్ అడ్వాన్స్ గా అందజేసినట్లు దర్యాప్తులో తేలిందని ఏజెన్సీ తెలిపింది.
సుఖేషుని లీలలు అన్నీ ఇన్నీ కావు. ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేసిన అక్రమ సొమ్ముతో బహుమతులు కొనుగోలు చేసారని ED ఆరోపించింది. కేంద్ర హోం సెక్రటరీగాలా.. సెక్రటరీగా ఫోన్ లో పరిచయం చేసుకుని అదితి సింగ్ తో పాటు ఆమె సోదరిని సుఖేష్ చంద్ర మభ్యపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఫోన్ లో ప్రతిబింబించే నంబర్ విధానంతో అతడు ట్రాప్ చేసాడు. ప్రభుత్వ అధికారుల నుండి కాల్స్ వచ్చినందున వారిని మోసగించడం అతడికి సులువైంది. కాల్ లో అతను ఒక ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సహాయం చేయడానికి వచ్చానని చెప్పుకున్నట్టు దర్యాప్తులో కనుగొన్నట్లు ED తెలిపింది. ఈ పద్ధతిని అవలంబిస్తూ సదరు వ్యక్తి తనను తాను కేంద్ర హోం కార్యదర్శిగా.. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా ప్రధాన మంత్రుల కార్యాలయం (PMO) అధికారి ఇతర జూనియర్ అధికారులను అనుకరిస్తూ... శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ను సంప్రదించి రూ.200 కోట్లకు పైగా దోపిడీ చేశాడు. పార్టీ నిధులకు విరాళాల సాకుతో ఒక సంవత్సరం పాటు ఆమె నుండి డబ్బు వసూలు చేసాడు. అంతేకాదు సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని సెంట్రల్ జైలు (తీహార్ జైలు) నుండి జైలు అధికారులతో కలిసి తన అక్రమ దోపిడీ వ్యాపారాన్ని నడుపుతున్నాడని ED తెలిపింది.
గత ఏడాది ఆగస్టు .. అక్టోబర్ లలో రికార్డ్ చేసిన తన స్టేట్ మెంట్ లో ఆమె గూచీ చానెల్ నుండి మూడు డిజైనర్ బ్యాగ్ లు.. జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులను.. ఒక జత లూయిస్ విట్టన్ షూస్.. రెండు జతల డైమండ్ వంటి బహుమతులు అందుకున్నట్లు ED కి చెప్పింది. చంద్రశేఖర్ నుండి చెవిపోగులు ..రంగు రాళ్ల బ్రాస్ లెట్.. రెండు హీర్మేస్ కంకణాలు జాకీ అందుకుంది. అయితే జాక్విలిన్ ఫెర్నాండెజ్ తనకు అందిన మినీ కూపర్ కారును తిరిగి అతడికి వెనక్కి ఇచ్చానని చెప్పారు. ఫిబ్రవరి నుంచి వెంబడించి గత ఏడాది అరెస్టులు చేసే వరకు (ఢిల్లీ పోలీసులు) చంద్రశేఖర్ తో సాధారణ సంప్రదింపులు చేసిన ఏజెన్సీ తన దర్యాప్తులో చాలా సంగతులను కనుగొంది. ఈ కేసులో చంద్రశేఖర్.. అతని భార్య లీనా మరియాపాల్.. ఇరానీ ఇతరులు సహా మొత్తం ఎనిమిది మందిని ED అరెస్టు చేసింది. ఢిల్లీ కోర్టు ముందు రెండు ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసింది.