Begin typing your search above and press return to search.
సుకేష్ తో జాకీ కుంభకోణం రుజువైతే పరిస్థితి ఏంటి?
By: Tupaki Desk | 2 May 2022 7:00 AM ISTబాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ పేరు మళ్లీ ఇంటా బయటా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న సుకేశ్ చంద్రతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జాకీ అడ్డంగా బుక్కైంది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో ఎంతటి సంచలనమయ్యాయో తెలిసిందే. దీంతో వెంటనే లైన్ లోకి వచ్చి జాకీ వాటిని షేర్ చేయోద్దని సోషల్ జనాల్ని కోరుకుంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందుకు విచారణకి హాజరైంది.
తాజాగా జాక్వెలిన్ పెర్నాండేజ్ కి చెందిన 7 కోట్ల రూపాయల ఆస్తుల్ని..ఎఫ్.డీల్ని ఈడీ జప్తు చేసింది. ఈ సన్నివేశంతో జాకీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. జాకీతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సుకేష్ భారీగా డబ్బులు ఇచ్చినట్లు.. ఈ సొమ్ము అంతా నేరగాళ్ల సొత్తు అని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే జాకీ ఆస్తులు అటాచ్ చేసారు. దీంతో జాకీ భవితవ్యంపై మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
ప్రస్తుతానికి అభియోగాలే ఎదుర్కుంటున్నప్పటికీ జాకీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. సుకేష్ తో కలిసి దిగిన ఫోటోలు.. ఇద్దరు కలిసి తీసుకున్న హోటల్ బిల్స్...జాకీ అందుకున్న బహుమతులు వెనుక కథ అంతా జాకీని ఇరకాటంలో పెట్టేలాగే కనిపిస్తున్నాయి. విచారణ ముగిసి కేసు రుజువైతూ జాకీ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర ధారి అవుతుంది . అయితే తాజా పరిణామాలు జాకీ కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఆమె చేతిలో కొన్ని సినిమాలున్నాయి. బాలీవుడ్ లో `విక్రాంత్ రోనా`...`సిర్కస్`..`రామ సేతు` చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి. వాటి షూటింగ్ కి అంతరాయం ఏర్పడే అవకాశం లేదు. కేసు విచారణలోనే ఉంది కాబట్టి ఈలోపు ఆ సినిమాలు షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.
నటిగా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ఏడాదికి రెండు..మూడు సినిమాలు చేసే జాకీ గ్రాఫ్ పరిశీలిస్తే రెండేళ్ల నుంచి సినిమాల సంఖ్య పెరిగింది. కానీ తాజా ఆరోపణలో నేపథ్యంలో ఆ ప్రభావం భవిష్యత్ ప్రాజెక్ట్ లపై పడే అవకాశం ఉంది. ఈ ఆరోపణలు కారణంగానే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `హరిహర వీరమల్లు` ప్రాజెక్ట్ నుంచి జాకీని తప్పించారు.
జాకీ ఈసినిమా కోసం 40 రోజులు కాల్షీట్లు కూడా కేటాయించింది. షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతోన్న సమయంలోనే ఈ ఆరోపణలు రావడంతో హుటాహుటిన పవన్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అలాగే కోలీవుడ్ లోనూ ఓ స్టార్ హీరో సినిమాకి అగ్రిమెంట్ చేసుకుందని ప్రచారం సాగింది. కానీ మనీ స్కామ్ నేపథ్యంలోనే జాకిని నిష్ర్కమించినట్లు మీడియా లో ప్రచారం సాగుతుంది. ఇక ఆరోపణలు రుజువైతే బాలీవుడ్ కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. జాక్వెలిన్ పెర్నాండేజ్ శ్రీలంక నుంచి ముంబై వచ్చి స్థిరపడిన సంగతి తెలిసిందే.