Begin typing your search above and press return to search.

ప్ర‌మోష‌న్స్ విషయంలో మంకు ప‌ట్టు ప‌డుతున్న స్టార్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   18 Sep 2020 2:30 AM GMT
ప్ర‌మోష‌న్స్ విషయంలో మంకు ప‌ట్టు ప‌డుతున్న స్టార్ హీరోయిన్...!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మంకు ప‌ట్టు పడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ నటించిన ఓ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అనేక వాయిదాల అనంతరం సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే రెండేళ్ల తర్వాత తమ ఫెవరేట్ హీరోయిన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చని ఆశలను అభిమానులకు కరోనా వచ్చి అడియాశలు చేసింది. ఈ క్రమంలో థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్లే మంచి డీల్ కుదరడంతో ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేసారని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి సదరు హీరోయిన్ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నిర్మాతలు బ్రతిమాలితే మొత్తం అన్ని భాష‌ల‌కి క‌లిపి కేవలం 2 రోజులు టైమ్ ఇచ్చిందట. నిజానికి అమ్మడికి ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం మొదటి నుంచి ఇష్టం లేదట. రెండేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా థియేటర్స్ లోనే తన సినిమాని విడుదల చేయాలని డిమాండ్ చేసిందట. అందుకే మూవీ ప్రచారానికి రావడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. దీనికి తోడు తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేక‌పోవ‌డంతో.. మీడియా నుంచి వచ్చే ప్ర‌శ్న‌లు ఎదుర్కోవ‌డానికి రెడీగా లేకపోవడం కూడా ఒక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.