Begin typing your search above and press return to search.

నటి బాయ్ ఫ్రెండ్‌ కోసం డేటింగ్‌ యాప్స్ కి వెళ్తే...!

By:  Tupaki Desk   |   23 April 2022 2:30 AM GMT
నటి బాయ్ ఫ్రెండ్‌ కోసం డేటింగ్‌ యాప్స్ కి వెళ్తే...!
X
ఉత్తరాది బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు హిబా నవాబ్‌. ఈ అమ్మడు పెళ్లి కోసం తెగ ఆరాట పడుతోంది. ఆమద్య తన స్నేహితులు అంతా కూడా వారి వారి లవర్స్ తో సరదాగా గడుపుతున్నారు. కాని నాకు మాత్రమే ప్రియుడు లేడు అంటూ తెగ బాధ పడిపోయింది. ఒక బాయ్ ఫ్రెండ్‌ ను పట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసిన హిబా నవాబ్‌ పప్పులో కాలు వేసిందట.

ప్రియుడి కోసం డేటింగ్‌ యాప్స్ కు వెళ్లిందట. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న డేటింగ్‌ యాప్స్ లో ఆకతాయిలు ఎక్కుగా ఉన్నారట.. అక్కడి వారితో వామ్మో తన వల్ల కాదు అంటూ బయటకు వచ్చేసిందట. తన మొబైల్‌ లో ఉన్న డేటింగ్ యాప్స్ అన్నింటిని కూడా డిలీట్ చేసి.. రెగ్యులర్ ఫార్మట్‌ లో ప్రియుడిని వెక్కుకోవాలనుకుంది. ఆ సమయం వచ్చిందేమో అమ్మడికి ప్రియుడు సెట్‌ అయ్యాడట.. పెళ్లికి రెడీ అంటోంది.

ఇటీవలే నాకు ప్రియుడు దొరికాడు అంటూ సంతోషంగా సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్న నటి హిబా నవాబ్‌ ఇప్పుడు పెళ్లి కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మరీ పెళ్లి చేయమని అడిగినట్లుగా చెప్పుకొచ్చింది. సాదారణంగా ఏ తల్లిదండ్రులు అయినా కూడా పిల్లలను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. కాని నా తండ్రి మాత్రం పెళ్లికి అప్పుడే తొందర ఏంటి అన్నట్లుగా మాట్లాడాడు.

ఆయన ఉద్దేశ్యంలో పెళ్లి చేసుకుంటే స్వేచ్చ పోతుంది.. జీవితంలో అనుకోని బాధ్యతలు మొదలు అవుతాయి.. అందువల్ల చేయాలనుకున్నది చేయలేరు కనుక పెళ్లి మెల్లగా చేసుకోవడం ఉత్తమం అనేది ఆయన అభిప్రాయం. ఆయన ఉద్దేశ్యం సరైనదే కాని నేను ప్రేమించిన వ్యక్తం ఖచ్చితంగా నా జీవితంలో పూర్తి స్వేచ్చ ను నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

గతంలో ఈ అమ్మడు పెరల్‌ వీ పూరి తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య సాన్నిహిత్యం చాలా దూరం వెళ్లిందని... పెళ్లి చేసుకోవడం తరువాయి అన్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కాని హిబా మాత్రం ఆ పుకార్లను కొట్టి పారేసింది.

వర్క్‌ లో భాగంగా ఇద్దరం రోజులో 20 గంటలు కలిసి పని చేసిన సందర్బాలు ఉన్నాయి. అలా మేము ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము. అంతే తప్ప మా మద్య ప్రేమ లేదు అంది. ఇప్పుడు హిబా ప్రేమిస్తున్న వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.