Begin typing your search above and press return to search.

దేశముదురు బ్యూటీ రియల్‌ 'షాదీ డ్రామా' ఓటీటీ అఫిషియల్‌

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:23 AM GMT
దేశముదురు బ్యూటీ రియల్‌ షాదీ డ్రామా ఓటీటీ అఫిషియల్‌
X
అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు సుదీర్ఘ కాలం పాటు తెలుగు.. తమిళంతో పాటు ఇతర భాషల్లో సందడి చేస్తోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే తన వ్యాపార భాగస్వామి కమ్‌ ప్రియుడు అయిన సోహైల్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.

సెలబ్రిటీల పెళ్లి వీడియోలకు మరియు పెళ్లి హంగామా వీడియోలకు మంచి ఆధరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి ని ఒక డాక్యుమెంటరీ తరహాలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. పాపులారిటీ పెరగడంతో పాటు కోట్లల్లో ఆదాయం కూడా వస్తుంది.

ఇప్పటికే సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌ నయనతార తన పెళ్లి వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీకి అమ్మేయడం.. ఆ ఓటీటీ వారు నయన్‌.. విఘ్నేష్ శివన్ ల యొక్క పెళ్లి ని డాక్యుమెంటరీ తరహా లో తీసుకు రావడం జరిగింది. ఇప్పుడు హన్సిక మరియు సోహైల్‌ ల యొక్క వివాహంకు సంబంధించిన వీడియోను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ వారు స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

లవ్‌ షాదీ డ్రామా అనే టైటిల్ తో హన్సిక యొక్క పెళ్లి వీడియోను ఒక డాక్యుమెంటరీ తరహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డాక్యుమెంటరీ అంటే బోరింగ్ స్క్రీన్‌ ప్లేతో కాకుండా ఆకట్టుకునే పెళ్లి హడావుడి మరియు ఒకింత డ్రామా మరియు ఎంటర్‌ టైన్మెంట్‌ ను కూడా ఈ వీడియోలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

హన్సిక కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీ మొత్తంను పెట్టి డిస్నీ వారు ఆ పెళ్లి హక్కులను తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా అలరించే విధంగా హన్సిక యొక్క లవ్‌ షాదీ డ్రామా ఉంటుంది అంటూ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ వారు నమ్మకంతో ఉన్నారు. ప్రోమో విడుదల చేసిన హాట్‌ స్టార్ వారు త్వరలో డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.