Begin typing your search above and press return to search.
'పుష్ప' ఎక్స్ ప్రెషన్ తో దేశముదురు బ్యూటీ
By: Tupaki Desk | 19 Jun 2022 4:00 PM ISTడిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండీ గా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం మూవీలోని చార్ట్ బస్టర్ పాటలు.. మాస్ డైలాగ్స్ అంతగా ఆకట్టుకున్నాయి. వీటిని చాలా మంది సెలబ్రిటీలు క్రీడాకారులు అనుకరిస్తుండడమే ఈ క్రేజ్ కి కారణం. దేశముదురు కథానాయిక హన్సిక మోత్వానీ చాలా ఆలస్యమైనా కానీ లేటెస్టుగా `పుష్ప`లోని అల్లు అర్జున్ పాటకు తన పాపులర్ ఎక్స్ ప్రెషన్ రీల్ ను షేర్ చేసింది.
సౌత్ బ్యూటీగా పాపులరైన హన్సిక మోత్వాని తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ అంటే విపరీతంగా అభిమానిస్తుంది. ఇప్పటికీ బన్నీ అవకాశమిస్తే అతడి సరసన నటించేందుకు ఆసక్తిగా ఉంది ఈ బ్యూటీ. ఈ జోడీ తెలుగులో `దేశముదురు` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదంతా అటుంచితే బన్ని `పుష్ప` నుంచి మాసీ ఎక్స్ ప్రెషన్ ను ప్రదర్శించే రీల్ ను హన్సిక పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. హన్సిక షేర్ చేసిన వీడియోని అల్లు అర్జున్ తిరిగి రీపోస్ట్ చేశారు!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప: ది రైజ్` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మూవీ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ బెల్ట్ లో రూ. 100 కోట్ల మార్కును కూడా నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతకుమించి అల్లు అర్జున్ నటుడిగా గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ ని మరో లెవల్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
హన్సిక కెరీర్ విషయానికి వస్తే...ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తోంది. కరోనా క్రైసిస్ వల్ల చాలా సినిమాల షూటింగ్ నెమ్మదిగా సాగింది. ప్రస్తుతం పెండింగ్ చిత్రీకరణలు కొనసాగుతున్నాయి. `మహా` అనే చిత్రంలో నటిస్తున్న హన్సిక తెలుగులో 105 మినిట్స్... మై నేమ్ ఈజ్ శృతి చిత్రీకరణలు పూర్తి చేసింది. తమిళంలో రౌడీ బేబీ వంటి చిత్రాల్లో నటిస్తోంది. `మహా` పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో హన్సిక మాజీ ప్రియుడు శింబు కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. విజయ్ చందర్.. ఆర్.కన్నన్ లతో సినిమాలు చిత్రీకరణకు వెళ్లనున్నాయి.