Begin typing your search above and press return to search.

సాహో లీక్స్ .. గ‌న్ ప‌ట్టిన కి`లేడీ`!

By:  Tupaki Desk   |   18 March 2019 6:03 AM GMT
సాహో లీక్స్ .. గ‌న్ ప‌ట్టిన కి`లేడీ`!
X
సూటిగా సుర‌సుర చూస్తూ కుర్ర‌కారు గెండెల్ని కోసేసే ఆ చిన్న‌ది డార్లింగ్ ప్ర‌భాస్ గుండెల‌కే గ‌న్ గురి పెట్టింది. తాడో పేడో తేల్చుకుందాం రా! అంటూ స‌వాల్ విసిరింది.. ఇంత‌కీ ఎవ‌రా సిన్న‌ది? అంటే కాస్త వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

త‌న‌దైన అందం చందం ఒడ్డు పొడ‌వుతో ఉత్త‌రాది అభిమానుల‌కు ఏనాడో గురిపెట్టింది ఈ అమ్మ‌డు. ప‌లు త‌మిళ చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం సౌత్ లో వేగం పెంచుతోంది. టాలీవుడ్ కి ప‌రిచ‌యమవుతోంది. ఈ అమ్మ‌డి పేరు ఈవ్‌ లీన్ శ‌ర్మ‌. ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో లాంటి భారీ చిత్రంలో న‌టిస్తోంది ఈవ్‌ లీన్. శ్ర‌ద్ధా క‌పూర్ తో పాటుగా ఈ అమ్మ‌డు కూడా గ‌న్ చేత‌ప‌ట్టి బుల్లెట్ల వ‌ర్షం కురిపించ‌బోతోంద‌ట‌. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా లీక‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. కేజీల కొద్దీ బ‌రువున్న ఆ భారీ గ‌న్ చూస్తుంటే సెక‌న్ల‌లోనే వంద‌లాది బుల్లెట్లు గుండెల్ని చీల్చి చెండాడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ తుపాకిని మించి ఈ అమ్మ‌డి అంద‌చందాలు అంతే ఇదిగా డార్లింగ్ ఫ్యాన్స్ గుండెల్ని చీల్చి చెండాడుతాయ‌నుకోండి!

చాప్ట‌ర్ 1, చాప్ట‌ర్ 2 పేరుతో మేకింగ్ వీడియోలు ఇప్ప‌టికే యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇంకా ఇంకా ఈ వీడియోలు అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉన్నాయి. ప్ర‌భాస్ - శ్ర‌ద్ధా క‌పూర్ - ఈవ్‌ లీన్ శ‌ర్మ వీళ్లంతా అదిరిపోయే యాక్ష‌న్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఆగ‌స్టు 15 ముహూర్తం ఫిక్స్ చేశారు కాబ‌ట్టి ఆ బిగ్ డే కోస‌మే అభిమానులంతా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ లోగానే ఈవ్‌ లీన్ వీడియో ట్రీట్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. సాహో కి సంబంధించిన మ‌రిన్ని వీడియోల్ని రివీల్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంద‌ట‌. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం లో యువి క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు 225 కోట్ల బ‌డ్జెట్ ని కేటాయించార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది.