Begin typing your search above and press return to search.

బ్రేకప్ తో డిప్రెషన్‌ అక్కర్లేదంటున్న ముద్దుగుమ్మలు

By:  Tupaki Desk   |   20 July 2022 3:30 AM GMT
బ్రేకప్ తో డిప్రెషన్‌ అక్కర్లేదంటున్న ముద్దుగుమ్మలు
X
సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్‌ అనేవి చాలా కామన్‌ విషయం. ఆ బ్రేకప్స్ వల్ల చాలా మంది నటీ నటులు తమ కెరీర్‌ ను కూడా వదిలేసి డిప్రెషన్ కు వెళ్లి పోయేంతగా బాధపడుతూ ఉంటారు. హీరోయిన్ లతో పాటు హీరోలు కూడా ఇండస్ట్రీలో బ్రేకప్‌ ను ఎదుర్కొన్న వారు ఉన్నారు. అయితే హీరోలతో పోల్చితే హీరోయిన్స్ ఎక్కువగా డిప్రెషన్‌ కు వెళ్లి పోయామని అంటూ ఉంటారు.

కొందరు డిప్రెషన్‌ నుండి బయటకు రాగా.. కొందరు బ్రేకప్ అయినా కూడా బ్రేవ్‌ గా ఉండి లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు. బాలీవుడ్‌ కు చెందిన ప్రస్తుత స్టార్‌ హీరోయిన్స్‌ లో మెజార్టీ హీరోయిన్స్ ఒకప్పుడు బ్రేకప్‌ పెయిన్‌ ను అనుభవించిన వారే. ఇప్పుడు బ్రేకప్‌ అనేది కామన్ విషయం.. కాని కొన్నాళ్ల క్రితం వరకు బ్రేకప్‌ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.

బ్రేకప్‌ గురించి కొందరు హీరోయిన్స్ చాలా పాజిటివ్ గా స్పందించారు. కొందరు బ్రేకప్‌ మంచికే అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం బ్రేకప్ నుండి బయట పడటానికి సలహాలు ఇస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే చాలా కాలం పాటు బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.

ఆయనతో బ్రేకప్‌ అయిన సమయంలో చాలా బాధ పడిందట. కానీ ఆ సమయంలో తనను తాను ఓదార్చుకుంటూ మరోసారి అతనికి అవకాశం ఇచ్చినందుకు తనను తాను నిందించుకుంటూ అందులో నుండి బయటకు వచ్చేశానని చెప్పింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని లీడ్‌ చేస్తోంది.

ఇక కత్రీనా కైఫ్ కూడా బాలీవుడ్‌ హీరో తో ప్రేమలో పడింది. ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించినా కూడా బ్రేకప్‌ అయ్యింది. బ్రేకప్ వల్ల నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ సమయంలో అమ్మ మాటలు నాలో ధైర్యం ను నింపాయి. చాలా మంది జీవితంలో ఇది సహజం. కనుక అధైర్యపడవద్దని అమ్మ చెప్పిన మాటతో నేను బ్రేకప్‌ బాధ నుండి ఈజీగా బయట పడ్డాను అంది. ఇప్పుడు విక్కీ కౌశల్‌ తో వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంది.

ఇలియానా కూడా ప్రేమలో పడి బ్రేకప్ ను చవి చూసింది. బ్రేకప్‌ సమయంలో తనతో తాను ఎక్కువ సమయం గడిపాను అని.. ఇష్టమైన విషయాలు.. పనులు చేశాను అంది. తద్వారా బ్రేకప్ నుండి బయట పడ్డట్లుగా చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్‌ కూడా బ్రేకప్‌ విషయాన్ని గురించి తాజాగా ఒక టాక్ షో లో మాట్లాడింది. బ్రేకప్ తో కుంగిపోను. నాకు నచ్చిన వ్యక్తులతో నా మంచి కోరే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం వల్ల డిప్రెషన్ నుండి బయట పడతానంటూ తన యొక్క అనుభవాలను చెప్పుకొచ్చింది.

అనన్య పాండే కూడా ఇటీవలే తన ప్రియుడితో బ్రేకప్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అనన్య తన బ్రేకప్ కు సంబంధించిన జ్ఞాపకాలతో బాధ పడకుండా నార్మల్‌ గా ఉందట. అందుకు కారణం తనకు నచ్చిన పాటలు వింటూ.. ఎప్పుడు కూడా తనకు క్లోజ్ గా ఉండే వారితో గడుపుతుందట. తద్వారా చాలా త్వరగా ఆ వ్యక్తి ని మర్చిపోయిందట. మొత్తానికి బ్రేకప్‌ అనేది ఒక సాధారణ విషయం కనుక డిప్రెషన్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అనేది ఈ ముద్దుగుమ్మల మాటలు.. పాఠాలు.