Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : సింపుల్‌ కాస్ట్యూమ్ లో స్టన్నింగ్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   4 April 2022 1:30 PM GMT
ఫోటోటాక్‌ : సింపుల్‌ కాస్ట్యూమ్ లో స్టన్నింగ్‌ బ్యూటీ
X
తెలుగు బిగ్‌ బాస్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. కాని బిగ్‌ బాస్ కు ముందు ఈమె ఎవరు అనేది పెద్దగా ఎవరికి తెలియదు. కాని ఇప్పుడు మాత్రం ఈమె ఒక స్టార్‌ అనడంలో సందేహం లేదు. వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ కూడా దక్కింది.

తన ప్రతి ఫోటో షూట్‌ తో ఇన్‌ స్టా గ్రామ్‌ లో రచ్చ చేస్తూనే ఉండే ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఒక సింపుల్ లంగా ఓనీ లో ఈ అమ్మడు కనిపించి సింప్లీ సూపర్‌ అంటూ కామెంట్స్ దక్కించుకుంది. ఇలాంటి ఒక అమ్మడి అందం ను ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులు ఎలా మిస్ అయ్యారో కదా అంటూ జనాలు కామెంట్స్ చేస్తు ఆమె అందాన్ని ఆకాశమే హద్దు అన్నట్లుగా పొగిడేస్తున్నారు.

దివి తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో లో ఆమె అందం ను ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. నడుము అందాన్ని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ కనిపించి కనిపించకుండా నాభి అందంతో కూడా ఊరిస్తున్న ముద్దుగుమ్మ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందం ఈమెది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ప్రతి ఒక్క ఫోటో షూట్ కూడా ఆమె స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి. పాపం ఈమె తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల స్టార్‌ హీరోలకు కనిపించడం లేదు.. చిన్న హీరోలు లైట్‌ తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హీరోయిన్‌ గా ఈమె ఎంట్రీ ఇప్పటికే జరిగింది. కాని ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో ఈమెకు చిన్న పాత్రను మెహర్ రమేష్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే కాకుండా ఆమె మరిన్ని సినిమాలను కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు మరియు ఫోటో షూట్స్ రచ్చ చేస్తున్నాయి.