Begin typing your search above and press return to search.

పొగుడు కాళ్ల సుందరి థైస్‌ అందాలు అదరహో

By:  Tupaki Desk   |   8 Feb 2022 3:30 PM GMT
పొగుడు కాళ్ల సుందరి థైస్‌ అందాలు అదరహో
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 తో ఒక్కసారిగా హీరోయిన్‌ రేంజ్ గుర్తింపును దక్కించుకుంది. బిగ్‌ బాస్ లో దివి ఎంటర్‌ అయిన రెండు వారాల వరకు పెద్దగా మాట్లాడలేదు. అసలు ఈమె బిగ్ బాస్ లో ఎందుకు ఉంది.. ఏం చేస్తుంది అంటూ అంతా కూడా ట్రోల్స్ చేశారు. ఆమె బయటకు వచ్చేయడం ఉత్తమం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా దివి తన ప్రతిభను చూపించడం మొదలు పెట్టింది. గేమ్‌ లో ఇతరులతో పోటీ పడుతూ అద్బుతంగా రాణించడం ద్వారా బిగ్‌ బాస్ లో దివి ఎక్కువ వారాలే ఉంది. దివికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును బయటకు వచ్చిన తర్వాత ఫుల్‌ గా వినియోగించుకుంటూ దివి సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తుంది.

దివికి బిగ్ బాస్ ఫినాలే వేదిక మీద నుండి చిరంజీవి వేదాళం రీమేక్ లో అవకాశం ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలోనే కాకుండా దివి పాప ఇంకా పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా వస్తున్న ఆఫర్లకు ఈమె ఓకే చెప్పకుండా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తుంది. సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ల కంటే అధికంగా ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా దక్కతుంది. రెగ్యులర్‌ గా ఫొటోలు షేర్‌ చేస్తున్న ఈ అమ్మడు త్వరలో ఇన్‌ స్టా లో మిలియన్‌ ఫాలోవర్స్ ల్యాండ్‌ మార్క్ ను కూడా చేరుకోబోతుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే ఆ మార్క్‌ ను చేరుకునే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. సాదారణంగానే దివి కి పొడుగు కాళ్ల సుందరి అనే పేరు ఉంది. అలాంటి పొడుగు కాళ్ల సుందరి ఇలా థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మా దివి పాప హీరోయిన్‌ మెటీరియల్‌ అని.. బాలీవుడ్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గదు అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ముందు ముందు కాలంలో ఈ అమ్మడు హీరోయిన్‌ గా స్టార్‌ డమ్‌ దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు. తెలుగు లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్‌ చేయక పోవచ్చు.. కాని దివి వేరే భాషల్లో ట్రై చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని అంటున్నారు.