Begin typing your search above and press return to search.
అక్కడి నుండి ఇక్కడకు వస్తే ముద్దుగుమ్మలకు ఎందుకింత డిమాండ్?
By: Tupaki Desk | 5 Jan 2023 2:00 PM ISTఒకప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించే వారు కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను మించి సౌత్ సినిమాలు ఆడుతున్నాయి.. కలెక్షన్స్ ను నమోదు చేస్తున్నాయి. ఇండియన్ సినిమా ఫేస్ గా సౌత్ ఇండియన్ సినిమా మారింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు పలువురు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మొన్నటి వరకు తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించని జాన్వీ కపూర్ తెలుగు లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు పెద్ద హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించింది.. కానీ ఏ ఒక్కటి కూడా కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకోలేదు.
జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ కూడా దక్కలేదు. అందుకే అక్కడ ఆమె పారితోషికం నామమాత్రంగానే ఉంటుంది అనేది అక్కడి ప్రచారం. కానీ ఇక్కడ మాత్రం జాన్వీ కపూర్ భారీగా డిమాండ్ చేస్తుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకున్నా కూడా అక్కడ నుండి వచ్చిన హీరోయిన్ ను అంటూ ఇక్కడ కాస్త ఎక్కువగా డిమాండ్ చేయడం కామన్ విషయం.
ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అదే ఫార్ములాతో తెలుగు లో చేయబోతున్న సినిమాలకు భారీ పారితోషికంను డిమాండ్ చేస్తోంది. టైర్ 2 హీరోలకు అందనంత ఎత్తున ఈ అమ్మడి యొక్క రెమ్యూనరేషన్ ఉంది. కనుక టాలీవుడ్ లో ఆ కొంత మంది స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే ఈమె నటించాల్సి ఉంటుంది.
జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు కాస్త ఎక్కువ డిమాండ్ చేస్తున్నారట. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనే క్రేజ్ సినిమాకు దక్కడం వల్ల పబ్లిసిటీ దక్కుతుంది అనే ఉద్దేశ్యంతో మేకర్స్ కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదు అని బాలీవుడ్ ముద్దుగుమ్మలను తెలుగు లో నటింపజేస్తున్నారు.
జాన్వీ కపూర్ భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంది.. అందుకు తగ్గట్లు ఆమెకు మొదటి రెండు మూడు సినిమాలు సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సక్సెస్ లు దక్కకుంటే కచ్చితంగా ఆమె పారితోషికం భారీగా తగ్గి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.