Begin typing your search above and press return to search.

హత్యాయత్నం చేశారంటూ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పై నటి ఫిర్యాదు..!

By:  Tupaki Desk   |   25 Feb 2021 9:44 PM IST
హత్యాయత్నం చేశారంటూ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పై నటి ఫిర్యాదు..!
X
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సినీ నటి శ్రీ సుధ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని.. సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్ కె నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, శ్యామ్ ఐదేళ్లుగా తనతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించాడని హైదరాబాద్‌ లోని ఎస్‌.ఆర్‌ నగర్‌ పోలీసులకు శ్రీ సుధ గతంలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు వెనక్కి తీసుకోవాలని తనను బెదిరించాడని.. దీంతో తనకు అతడి వల్ల ప్రాణహాని ఉందని మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు తనను హత్య చేసే ఉద్దేశ్యంతో యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై సందేహం వ్యక్తం చేసింది శ్రీ సుధ.

ఇకపోతే శ్యామ్‌ కె. నాయుడుపై ఎస్ ఆర్ నగర్ లో పెట్టిన కేసు ద‌ర్యాప్తు కోసం సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు వ‌సూలు చేశా‌రని అప్పట్లో ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు త‌న‌తో రాజీ కుదుర్చుకున్న‌ట్లు న‌కిలీ డాక్యుమెంట్స్ సృ‌ష్టించార‌ని.. నాంప‌ల్లిలోని ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి శ్యామ్ కె నాయుడు పై సందేహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టింది శ్రీ సుధ.