Begin typing your search above and press return to search.

సుశాంత్‌ ఆత్మహత్య : హీరోయిన్‌ లైవ్‌ లో చేసిన పనిపై ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   16 Jun 2020 5:15 AM GMT
సుశాంత్‌ ఆత్మహత్య : హీరోయిన్‌ లైవ్‌ లో చేసిన పనిపై ట్రోల్స్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య నేపథ్యంలో సోషల్‌ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా చర్చ జరిగింది. ఈ మద్య కాలంలో ఒక మృతిపై ఇంతగా చర్చ జరిగింది లేదు. బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతిపై స్పందించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేసి ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

ఇక దేశంలో ఉన్న అన్ని న్యూస్‌ ఛానెల్స్‌ కూడా ఈ విషయమై చర్చ పెట్టాయి. సినీ ప్రముఖులు డాక్టర్లను మానసిక నిపుణులతో ఈ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న ఒక జాతీయ మీడియా ఛానెల్‌ సుశాంత్‌ ఆత్మహత్యపై చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఆ చర్చలో ప్రభాస్‌ సినిమా బుజ్జిగాడులో ఒక హీరోయిన్‌ గా నటించిన సంజన పాల్గొంది. ఆ చర్యలో అంతా సీరియస్‌ గా సుశాంత్‌ మరణంపై మాట్లాడుతూ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అలా చేసుకుని ఉండాల్సింది కాదంటూ మాట్లాడుతూ ఉన్నారు.

ఆ సమయంలోనే హీరోయిన్‌ సంజన మేకప్‌ టచప్‌ చేసుకుంటూ కనిపించింది. కెమెరా ఆన్‌ లో ఉందనే విషయం తెలిసి కూడా తన స్క్రీన్‌ లైవ్‌ లో రావట్లేదని భావించిందో ఏమో కాని మొత్తానికి అయితే లైవ్‌ లోనే మేకప్‌ సరి చేసుకుంటూ కనిపించి బుక్‌ అయ్యింది. ఆత్మహత్య విషయంపై చర్చించే సమయంలో మేకప్‌ అవసరమా. సరే మేకప్‌ వేసుకుని చర్చలో పాల్గొన్నారు ఓకే మళ్లీ లైవ్‌ లో మేకప్‌ ను సరి చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నెటిజన్స్‌ ఒక రేంజ్‌ లో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ విషయమై సంజన ఎలా రియాక్ట్‌ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.