Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : భయంకరంగా మారిన సాగర కన్య

By:  Tupaki Desk   |   2 July 2021 7:05 AM GMT
పిక్ టాక్‌ : భయంకరంగా మారిన సాగర కన్య
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ శిల్ప శెట్టి సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉంది. ఒకప్పుడు హీరోయిన్ గా అభిమానులను ఉర్రూతలూగిస్తే ఇప్పుడు మాత్రం ఈమే బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ఒక డాన్స్ షో కు జడ్జ్‌ గా వ్యవహరిస్తున్న ఈ అందాల రాశి తాజాగా ఈ ఫొటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఈమె ఒక డాన్స్ రియాల్టీ షో కోసం ఇలా కాస్ట్యూమ్స్ ను ధరించింది. కేవలం కాస్ట్యూమ్స్ విషయంలో నే కాకుండా ఈమె మేకప్‌ తో కూడా భయ పెట్టింది. ఏమాత్రం గుర్తు పట్టనంతగా మేకప్ అయిన శిల్ప శెట్టి సెట్‌ లో కొందరిపై ప్రాంక్‌ చేసి భయ పెట్టింది.

పొడవైన చేతులు మరియు అత్యంత భయంకరమైన ఫేస్ తో పాటు వింతైన కాస్ట్యూమ్స్ వల్ల ఆమె నిజంగానే దెయ్యం అన్నట్లుగా కొందరు భయపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. శిల్ప శెట్టి ని ఇలాంటి రూపంలో ఊహించలేదు అంటూ సెట్ లోని వారు కూడా అంతా భయబ్రాంతులకు గురి అయినట్లుగా చెబుతున్నారు. సూపర్‌ డాన్స్ ఛాప్టర్ 4 లో భాగంగా శిల్ప శెట్టి ఇలా సెట్ లో సందడి చేసింది. డాన్స్ మరియు యోగా అంటే చాలా ఇష్టపడే శిల్ప తన అందంకు రహస్యం ఆ రెండే అంటూ చెబుతూ ఉంటుంది.

శిల్ప శెట్టి అందం ముందు ఇతర బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ దిగదుడుపే అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటారు. ఆమెతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు ఎంతో మంది కనుమరుగు అయ్యారు. చాలా మంది ఉన్నా కూడా ఏదో ప్రాముఖ్యత లేని పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు. వారి వల్ల పెద్దగా ప్రయోజనం లేని పాత్రలు సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాని శిల్ప శెట్టి మాత్రం ఇప్పటికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటేనే సినిమాలు చేయడంతో పాటు బుల్లి తెరపై కనిపించినా కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను తెచ్చే షో లను మాత్రమే చేస్తుంది. ముద్దు గుమ్మ శిల్ప శెట్టి తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్‌ తో నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో నటించింది. సాగర కన్య ఉంటే నిజంగా ఇలాగే ఉంటుందా అంటూ ఆమె ను ప్రేక్షకులు అనుకున్నారు అంటే ఏ స్థాయిలో ఆ సినిమా లో నటించిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ సినిమాకు గాను ఈ అమ్మడు ఏకంగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డుకు నామినేట్ అయ్యింది. తెలుగు లో ఈమె చేసింది కొన్ని సినిమా లే అయినా కూడా సౌత్‌ హీరోయిన్స్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. ఈమె కు సంబంధించిన ప్రతి విషయం కూడా తెలుగులో హాట్ టాపిక్‌ గా అవుతూ ఉంటుంది. తాజాగా ఈమె దెయ్యం గెటప్ తో జనాలను భయపెట్టిన వీడియోలు కూడా తెలుగు మరియు తమిళ వారు తెగ చూస్తున్నారు. నెట్టింట ఆమె వీడియలు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒక రియాల్టీ షో కోసం ఇంతగా డ్రస్ అప్‌ అవ్వడం.. జనాలను భయ పెట్టడం ఏంటీ అంటూ కొందరు శిల్ప శెట్టిని ప్రశ్నిస్తున్నారు.