Begin typing your search above and press return to search.

కరోనా.. ఆ హీరోయిన్ కి అంత బోర్ కొట్టించిందా..??

By:  Tupaki Desk   |   16 July 2020 2:00 PM IST
కరోనా.. ఆ హీరోయిన్ కి అంత బోర్ కొట్టించిందా..??
X
ఈ కరోనా మహమ్మారి కారణంగా అసలు ప్రపంచం ఏమైపోతుందో ఎవరికీ అర్థంగాని స్థితిలో ఉంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా రోజురోజుకి వేల సంఖ్యలలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు వందల సంఖ్యలో జనాలు మరణిస్తూనే ఉన్నారు. సామాన్యుల దగ్గర నుండి సినీతారలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారస్తులు ఇలా ప్రతీ ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా మూడు నెలల లాక్ డౌన్ విధించినా కూడా పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఓ వైపు వైద్య బృందాలు, శాస్త్రవేత్తలు కరోనాను అరికట్టడానికి.. దానికి విరుగుడు కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాలకులు పరిశుభ్రత వైపు అడుగేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినీ హీరోయిన్లు ఏం చేస్తున్నారు ఈ లాక్ డౌన్ లో అంటే మాత్రం.. కొందరేమో వర్కౌట్స్ చేస్తున్నారు.

మరికొందరు ఎంచక్కా ఇంట్లో ఉంటూ వంటావార్పు నేర్చుకుంటూ.. వ్యాయామం చేస్తూ అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. అయితే తాజాగా తెలుగు హీరోయిన్ అంజలి మాత్రం ఫుల్ బోర్ కొడుతోందని అంటోంది. అవును ఇన్ని నెలలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో ఉంటే ఎవరికైనా అదే ఫీలింగ్ కలుగుతుంది. నాకు ఇంట్లో ఫుల్ బోర్ కొడుతోంది. అలాగే ఒకేచోట పిచ్చెక్కిపోతుంది. ఒకసారి ఈ కరోనా నుండి ఫ్రీడమ్ దొరకగానే రోడ్డు పై ఫుల్ గా డాన్స్ చేయాలనీ ఉందని చెబుతోంది. మరి అంతగా బోర్ కొట్టేసిందా అమ్మడికి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న అంజలి.. తమిళ, తెలుగు బాషలలో మూడేసి సినిమాలతో బిజీ కానుంది. ఇటీవలే ఆమె నటించిన నిశ్శబ్దం అనే పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన అంజలి త్వరలో హిట్టు కొడుతుందేమో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.