Begin typing your search above and press return to search.

సరోగసీకి నో.. నో అంటున్న సీనియర్ హీరోయిన్

By:  Tupaki Desk   |   27 Feb 2019 4:27 PM IST
సరోగసీకి నో.. నో అంటున్న సీనియర్ హీరోయిన్
X
'నువ్వు నేను' (2001) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత అప్పట్లో కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మెల్లగా హిందీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం అయితే హిందీ సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అనిత రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్త ను 2013 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయింది.

ఇదిలా ఉంటే అనిత ఈమధ్య అద్దెగర్భం(సరోగసీ) విధానం ద్వారా తల్లి కావాలని ప్లాన్ చేసుకుంటోందని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ విషయాన్ని ఆమె తాజాగా ఖండించింది. ఇప్పుడు తల్లి కావాలనే ఆలోచన ఉందా లేదా అనే విషయాన్ని ధృవీకరించలేదు కానీ సహజ పధ్ధతిలోనే పిల్లలను కనాలని తను అనుకుంటోందట. సరోగసీ ద్వారా పిల్లలు ప్లాన్ చేస్తున్నామని వచ్చిన వార్తలన్నీ రూమర్లని కొట్టిపారేసింది. అసలు సరోగసీ విధానంలో పిల్లలను కనాలనే ఆలోచన తనకు లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

నిజ జీవితంలో తల్లి పాత్ర పోషించడం అనేది బాధ్యతతో కూడుకున్నదని... తన వర్క్ షెడ్యూల్ లో కూడా ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. బహుశా వచ్చే ఏడాదిలో పిల్లలకోసం అలోచిస్తామేమో అంటూ చెప్పుకొచ్చింది అనిత. ఈ లెక్కన అనిత సరోగసీపై బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే.