Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ పోయే.. మంచు బ్యూటీ వచ్చే

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:41 PM
ఇల్లీ బేబీ పోయే.. మంచు బ్యూటీ వచ్చే
X
టైం బ్యాడంటే ఇలానే ఉంటుంది. చేతికొచ్చిన హాలీవుడ్ ప్రాజెక్ట్.. సెట్స్ కొచ్చే లోపే చేజారిపోతే ఎలా ఉంటుంది ? ఇప్పుడు ఇలియానా పొజిషన్ ఇదే. ఏడాదిగా ఒక్క సినిమా కూడా సైన్ చేయకుండా.. రోజులు లెక్కెట్టిన ఇల్లీ బేబికి ఒకే సారి రెండు క్రేజీ ఆఫర్స్ తలుపు తట్టాయి. అంతలోనే ఒకటి జారిపోవడం బాధాకరమే.

అక్షయ్ కుమార్ సరసన "రుస్తోం"తోపాటు.. జాకీచాన్ తో కలిసి "కుంగ్ ఫూ యోగ" అనే హాలీవుడ్ మూవీకి కూడా ఇలియానా ఎంపికైంది. జాకీచాన్ సినిమాలో చేయబోయేది చిన్న పాత్రే అయినా.. ఈ మూవీతో తాను ఇంటర్నేషనల్ గా క్రేజ్ సంపాదించుకోవచ్చని ఆశలు పెట్టుకుంది ఈ గోవా బ్యూటీ. కానీ ఏమైందో తెలీదు కానీ.. ఇలియానాని తప్పించి మరో సుందరిని తీసేసుకున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ మూవీకి సైన్ చేసిన అమీరా దస్తూర్ కి.. జాకీ చాన్ సినిమాలో చేసే ఆఫర్ దక్కింది. అమీరాకి ఆఫర్ కన్ఫాం కావండతో.. ఇల్లీ బేబీకి నిరాశే మిగిలింది. ఇలా ఓ హాలీవుడ్ మూవీ చేజారిపోవడంతో.. నిరాశపడిపోయింది ఇలియానా. మరోవైపు అమీరా మాత్రం దనకు దక్కిన అవకాశంతో ఫుల్లు ఖుషీగా ఉంది. ఒక భామకి బాధ.. మరో బ్యూటీకి లక్కీ ఛాన్స్ తెచ్చిపెట్టిందన్న మాట.