Begin typing your search above and press return to search.

నాలుగు చేతులా సంపాదిస్తున్న క‌థానాయిక‌

By:  Tupaki Desk   |   4 Oct 2022 8:00 AM IST
నాలుగు చేతులా సంపాదిస్తున్న క‌థానాయిక‌
X
ప‌రిశ్ర‌మ‌లో ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో దూసుకుపోవ‌డం కొంద‌రికే సాధ్యం. బాలీవుడ్ లో న‌టిగా నిర్మాత‌గా రాణించిన క‌థానాయిక‌ల్లో జూహీ చావ్లా- ర‌వీనా టాండ‌న్- అనుష్క శ‌ర్మ పేర్లు ప్ర‌ముఖంగా వినిపించేవి. త‌ర్వాత ప‌లువురు క‌థానాయిక‌లు నిర్మాత‌లుగా ప్ర‌య‌త్నించినా విఫ‌ల‌మ‌య్యారు.

కానీ నేటిత‌రంలో స‌క్సెస్ ని ఆస్వాధిస్తున్న యువ‌నాయిక‌గా ఆలియా భ‌ట్ పేరు ఈ జాబితాలో చేరింది. నిర్మాత కమ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా హీరోయిన్ గా ఈ యంగ్ బ్యూటీ బిజీ బిజీ. ప‌రిశ్ర‌మలో అగ్ర క‌థానాయిక‌గా త‌న హోదాను కొన‌సాగిస్తోంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో గోల్డెన్ లెగ్ గా వెలిగిపోతోంది. ఈ ఏడాదిలో నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించింది. గంగూబాయి కతియావాడి- డార్లింగ్స్- RRR- బ్రహ్మాస్త్రలో భాగ‌మైంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల ద్వారా ఆర్జ‌న‌లోను దూసుకుపోతోంది. వ్యాపార రంగంలో కూడా ఆలియా రాణిస్తోంది. త‌ను ఇప్పటికే పిల్లల దుస్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆమె కొత్త శ్రేణి ప్రసూతి దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. తాజాగా తన మెటర్నల్ వేర్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ``మునుముందు కొన్ని నెలల్లో మీరు ఎలా కనిపించబోతున్నారో లేదా ఎలా ఫీల్ అవుతారో మీకు తెలియదు. ధరించడానికి సరైన దుస్తుల‌ను కనుగొనలేకపోవడంతో ఒత్తిడికి లోనవుతారు`` అని వ్యాఖ్య‌ను జోడించింది.

అలియా భట్ తనకు పిల్లలు ఇంకా క‌ల‌గ‌క‌పోయినా తన కిడ్స్ వేర్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ కి భార్యగా గర్భిణిగా ఉంది. జూన్ 2022 లో తాను మ‌ద‌ర్ కాబోతున్న విష‌యాన్ని ప్రకటించింది. ఈ ఆనంద క్ష‌ణంలో ఇలా మెట‌ర్న‌ల్ వేర్ వ్యాపారంలోను స‌త్తా చాటుతోంది. యువ‌త‌రంలో ఆలియాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బ్రాండ్లు త‌న వెంట ప‌డుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.