Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్యూట్‌ బ్యూటీ అందంతో చంపేస్తోంది

By:  Tupaki Desk   |   31 May 2022 11:30 PM GMT
ఫోటోటాక్ : క్యూట్‌ బ్యూటీ అందంతో చంపేస్తోంది
X
తెలుగు ప్రేక్షకులకు మళ్లీ రావా.. సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ ఆ తర్వాత నాగార్జున.. నాని నటించిన 'దేవదాస్‌' సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగు నుండి వరుసగా ఆఫర్లు వచ్చినా కూడా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతుంది. ఇటీవలే తెలుగు లో క్లాప్‌ సినిమా తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెల్సిందే.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న ఆకాంక్ష సింగ్‌ మరో వైపు సోషల్‌ మీడియాలో అందాలు ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు నాని నిర్మిస్తున్న మీట్‌ క్యూట్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందని.. త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

సోషల్‌ మీడియాలో ఆకాంక్ష సింగ్‌ షేర్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటో వైరల్‌ అయ్యింది. చూడ్డానికి పై నుండి కింది వరకు కవర్ చేసినట్లుగా అనిపించినా కూడా థైస్ ను ఎంత కావాలో అంత ఎక్స్ పోజ్‌ చేస్తూ కుర్రకారును కవ్విస్తూ ఉంది. అందమైన ఈ అమ్మడి అందానికి ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే.

బుల్లి తెర మరియు వెబ్‌ సిరీస్ ల్లో నటించిన అనుభవంతో సినిమాల్లో మంచి కథలు ఎంపిక చేసుకుంటూ మెల్ల మెల్లగా కెరీర్ లో ముందుకు సాగుతున్న ఈ అమ్మడు రాజస్థాన్ లోని జైపూర్‌ కు చెందినది. అక్కడ నుండి చిన్నతనంలోనే హిందీ సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది. అక్కడ నుండి హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్‌ లో మోస్ట్‌ క్రేజీ హీరోయిన్ గా మారింది. భవిష్యత్తులో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.