Begin typing your search above and press return to search.

ఆర్టీసీ డిమాండ్స్ నెరవేర్చండి.. ఆ కష్టాలు నాకు తెలుసు: స్టార్ హీరో యష్

By:  Tupaki Desk   |   16 April 2021 3:00 PM IST
ఆర్టీసీ డిమాండ్స్ నెరవేర్చండి.. ఆ కష్టాలు నాకు తెలుసు: స్టార్ హీరో యష్
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వణుకు పుట్టిస్తుంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ అవస్థలు పడుతున్నారు. ఓవైపు కరోనాతో రోజురోజుకి వేలసంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ పరిష్కరించాలని సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఉద్యోగుల పై ఆ రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికి వారు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సమ్మెను ముమ్మరం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కన్నడ స్టార్ హీరో యష్ ఉద్యోగుల సమస్యలపై స్పందించి వారికీ మద్దతుగా నిలిచాడు. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మె కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిందని ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి తెలిపారు.

అయితే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై హీరో యష్ మద్దతు ప్రకటిస్తూ ఇదివరకే లేఖను అందించాడు. అలాగే ఇటీవలే ఆయనను కలిసి మాట్లాడాడు. ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా తనకు ఆర్టీసీ కష్టాలు తెలుసనీ.. అలాగే వారి పరిస్థితి కూడా ఇలాంటి సమయంలో ఎలా ఉంటుందో చెప్పగలను అని యష్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను బయటపెట్టిన యష్.. తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ గా ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో విధులకు హాజరైనట్లు చెప్పాడు. కావున ఆర్టీసీ కార్మికులకు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపి.. వారి డిమాండ్స్ నెరవేర్చాలని కోరునట్లు సమాచారం. యష్ సపోర్ట్ చేయడంతో ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యష్ కేజీఎఫ్-2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.