Begin typing your search above and press return to search.

ఆందోళనలో సూపర్‌ స్టార్‌.. ఫ్యాన్స్‌ కూడా

By:  Tupaki Desk   |   16 April 2020 8:30 AM GMT
ఆందోళనలో సూపర్‌ స్టార్‌.. ఫ్యాన్స్‌ కూడా
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాంఢవం చేస్తున్న కారణంగా ఎన్నో దేశాలు లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నాయి. ఇండియాకు పూర్తిగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడం జరిగింది. దాంతో విదేశాల్లో ఉన్న వారు ఇండియాకు తిరిగి రాలేక అక్కడ ఉండలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా.. కెనెడా.. స్పెయిన్‌.. మరికొన్ని యూరప్‌ కంట్రీస్‌ లో ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ కరోనా కరాళ నృత్యం చేస్తుండగా అక్కడే ఉండలేక.. స్వదేశంకు రాలేక నానా అవస్థలు పడుతూ బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ ను ప్రస్తుతం కెనడాలో గత ఏడాది కాలంగా అభ్యసిస్తున్నాడు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అతడు ఇండియాకు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటూ ఉండగా ఇండియాలో లాక్‌ డౌన్‌ ప్రకటించారు. దాంతో అతడు ఇండియాకు వచ్చే పరిస్థితులు లేవు. దాంతో కొడుకు విషయంలో విజయ్‌ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాడట. కెనడాలో కరోనా కేసులు ప్రతి రోజు వేలల్లో నమోదు అవుతున్న నేపథ్యంలో జసన్‌ సంజయ్‌ ఆరోగ్యం విషయంలో విజయ్‌ టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే జాసన్‌ కు వైధ్య అధికారులు పరీక్షలు నిర్వహించి కరోనా నెగటివ్‌ గా రిపోర్ట్‌ ఇచ్చారట. అయినా కూడా మళ్లీ మళ్లీ టెస్టులు నిర్వహించాల్సి ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో ప్రతి రోజు కూడా కొడుకు ఆరోగ్య సమాచారంను తెలుసుకుంటూ విజయ్‌ అతడికి జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడట. జాసన్‌ విషయంలో విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్‌ హీరో తనయుడు ఆరోగ్యంగా ఉండాలంటూ వారు ప్రార్థనలు చేస్తున్నారు.