Begin typing your search above and press return to search.

నీటిని వేస్ట్ చేస్తున్నారా.. రౌడీ వచ్చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   10 Aug 2019 10:28 AM IST
నీటిని వేస్ట్ చేస్తున్నారా.. రౌడీ వచ్చేస్తున్నాడు
X
ప్రతి నీటి బొట్టు విలువైనదే. ఇది అందరూ చెప్పే మాటే. మాటల్లో వినిపించే పొదుపు చేతల్లోకి వచ్చేసరికి కనిపించకుండా పోయే పరిస్థితి. నిత్యం నీటిని వృథా చేయటంలో జరుగుతున్న నష్టాన్ని ఎంత చెప్పినా ప్రజల్లో తీరు మారని పరిస్థితి. నీటి వృథా మీద ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రేటర్ హైదరాబాద్.. వాటర్ బోర్డు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా సరికొత్త బ్రాండ్ అంబాసిడర్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండను తెర మీదకు తీసుకురానున్నారు. నగరంలో నీటి వృథాను వీలైనంత మేర తగ్గించటంతో పాటు.. వృథా కారణంగా జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో విజయ్ దేవరకొండను ఉపయోగించుకుంటే బాగుంటుందన్న భావనతో జీహెచ్ ఎంసీ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో నిత్యం నీటి వృథా కారణంగా జరుగుతున్న నష్టం ఎంతో తెలుసా? అక్షరాల రూ.16 కోట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు చెప్పే కన్నా.. విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ తో చెప్పే తీరులో చెప్పేస్తే ప్రజల్లో ఎక్కేయటమే కాదు.. నీటిని వేస్ట్ కాకుండా అవగాహన పెరుగుతుందన్న ఆలోచనతో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. నీటి వృథాపై రౌడీ రంగంలోకి దిగుతున్న వేళ.. ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి.